Breaking News

వధువు కావలెను

Published on Thu, 04/09/2026 - 07:35

అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్‌ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. 

శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్‌: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు.   

పెరిగిన అడ్డుగోడలు.. 
ప్రస్తుతం ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్‌ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.  పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్‌ ఉంది.
  
పెళ్లికి అమ్మాయిల అనుమతి 
రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్‌ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు.      

పెరిగిన వివాహం వయసు 
ఒకప్పుడు అమ్మాయికి  పెళ్లీడు  రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు.  

అంతా 30 ఏళ్లు పైబడినవారే 
జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. 
 – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి 

యువత ఆలోచనలో మార్పు 
యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది.  
– వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు  

 

 

Videos

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?

కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

కాకాణిపై మరో అక్రమ కేసు

నయిమ్ ఖాసిమ్ ను చంపేశాం ఇజ్రాయెల్ కీలక ప్రకటన

నీది ఒక బతుకేనా... ABN రాధాకృష్ణకు కాకాణి మాస్ వార్నింగ్

Photos

+5

Allu Arjun Birthday Celebrations : సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)