Breaking News

మా ఆడపిల్లల్ని అదోలా చూస్తున్నారు..

Published on Sun, 09/07/2025 - 19:59

తమ ఊరికి మంచి పేరు తేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఊరి పేరే తమకు చెడ్డ పేరు తెస్తోందని ఆ ఊరివాళ్లు వాపోతున్నారు. గతంలో అప్పుడెప్పుడో తమ తాతల కాలం నాడు వాడుకలోకి వచ్చిన ఆ పేరు ఇప్పుడు తమ పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు కూడా అడ్డంకిలా పరిణమించిందని ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుండడం విశేషం. ఆ ఊరు ఏంటి? ఆ ఊరి పేరు ఎందుకు ఆ ఊరివాళ్ల పాలిట గుదిబండలా మారింది అనే వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఉన్నాయి పక్కపక్కనే ఉన్న రెండు ఊర్లు. ప్రస్తుతం ఆ ఊరి పేర్లే మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

అసభ్యకరంగా ఉన్న ఆ పేర్లను చెప్పడానికి ఇబ్బందిగా ఉందని తాము సభ్యతగా జీవిస్తున్నా తమ ఊరి పేరు మాత్రం తమను దిగజారుస్తోందనేది వీరి ఆవేదన. ఆ ఊర్లకు అలాంటి పేర్లు రావడానికి కూడా గత చరిత్ర దోహదం చేసిందని  ఆ ప్రాంతంలోని పాత తరం వారు చెబుతున్నారు.  ఈ రెండు గ్రామాలు కొండల్ని ఆనుకుని ఏర్పడ్డాయి చాలా కాలం క్రితం సంపన్నులైన పర్లాఖిమిండి రాజవంశీయుల ప్రాపకంతో ఆ ఊర్లు ఏర్పడ్డాయట. సదరు రాజ వంశంలోని మగవారు తమ ఆధీనంలోని  ఉంపుడుగత్తెలను ఉంచడం కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నారట.  అంతేకాకుండా వారికి కొన్ని భూములను కూడా బహుమతులుగా ఇచ్చారట. ఈ కారణంగానే ఆ ఊర్లకు అలాంటి పేర్లు వచ్చాయని ఆ ఊరి చరిత్ర గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అక్కడ ఉంపుడుగత్తెలను ఉంచేవారు కాబట్టి ఆ ఊర్లను సానిపాలెం, సవర సానిపాలెం అంటూ పిలిచేవారట. 
 

అలా అలా అదే పేర్లు  రికార్డులలోకి కూడా ఎక్కాయట. ఆ ఊర్లలోని ఒకటైన సానిపాలెంలో దాదాపు 220 కుటుంబాలు ఉన్నాయి. ఆ దగ్గరలో ఎస్టీ కులాల వారు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని సవర సానిపాలెంగా పిలుస్తున్నారు. కొంత కాలం పాటు ఆ పేర్లు అలాగే కొనసాగినా... ప్రస్తుతం ఆ ఊర్లలో అనేక మంది విద్యావంతులుగా , అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందుతుండడంతో ఆ ఊరి పేర్లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో గ్రామస్తులు తమ ఊర్ల పేర్లను మార్చాలని కోరుతున్నారు.  

ఆధార్, రేషన్‌ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లలో ఆ ఊరి పేర్లు ఉండటంతో అవమానంగా ఉందని, మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపధ్యంఓ తమ ఊర్ల  పేరు మార్చాలని కోరుతూ ఈ రెండు గ్రామాల ప్రజలు తహసీల్దార్, డీఆర్వోలకు అలాగే శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో కూడా . వినతిపత్రాలు అందజేశారు. సానిపాలెం పేరును రామయ్యపాలెంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, గ్రామాల పేర్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆ ఊరివాళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు అంటున్నారు.  ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పేరు మార్పునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.

చాలా సందర్భాల్లో తమ ఊరి పేరు చెప్పాలంటేనే సిగ్గుగా ఉంటోందని స్థానికులు అంటున్నారు.. తమ గ్రామం పేరు చెప్పి అవమానాలు కూడా పడ్డామంటున్నారు. కొందరు ఊరి పేరు చెప్పగానే నవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో రాజుల కాలం నాటి పేర్లు అలాగే ఉన్నాయని.. వాటిని ఇప్పుడైనా మార్చాలని కోరుతున్నారు. వీరి వినతికి స్పందించి ప్రభుత్వం పేరు మార్పు ఎప్పుడు చేస్తుందో...చూడాలి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)