Breaking News

సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?

Published on Sat, 04/12/2025 - 15:08

రుచికరమైన వంటకాలు, కబుర్లు ,కాకర కాయలతో ఇంతకాలం అలరించిన ‘‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’’కు శుభం కార్డు పడింది. తమ అభిమాన  ఓటీటీ తారలు ఈ సిరీస్‌లో పాక నిపుణులుగా రూపాంతరం చెందడాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. ఫరా ఖాన్, వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్ న్యాయ నిర్ణేతలుగా ఉన్న  సెలబ్రిటీ మాస్టర్ చెఫ్  గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 11న గ్రాండ్‌గా జరిగింది. ఇంతకీ ఈ షో విజేత ఎవరు,  ప్రైజ్‌మనీ ఎంత? ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి!

ప్రముఖ టెలివిజన్ నటుడు, అనుపమ పాత్రతో పాపులర్‌ గౌరవ్ ఖన్నా ఈ షో విజేతగా నిలిచాడు. సీజన్‌తో తనదైన శైలితో ఆకట్టుకున్న గౌరవ్‌ చివరి ధశలో కూడా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాడు. సిగ్నేచర్ డిష్‌లు, రుచులు, స్టైల్‌తోమాత్రమే కాకుండా, కాన్పూర్ నుంచి ముంబై దాకా సాగిన భావోద్వేగ ప్రయాణం గురించి పంచుకున్న కథ కూడా  అటు ప్రేక్షకులను, ఇటు న్యాయనిర్ణేతల  హృదయాలనూ  కదిలించింది. దీంతో ఫలితాలు ప్రకటిస్తూ గౌరవ్‌ను వారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నలుగురు హేమాహేమీలను ఓడించి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని దక్కించుకున్నాడు గౌరవ్‌.  ఫలితంగా  రూ. 20 లక్షల నగదు బహుమతి,  ప్రీమియం కిచెన్ ఉపకరణాలను గెలుచుకున్నాడు.

నెమ్మదిగా ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన వంటకాలను నేర్చుకుని అందించి ఈ రోజు ఈ స్థానానికి చేరుకున్నాడు.ఇది నా మొదటి రియాలిటీ షో" నేను ఎప్పుడూ కెమెరా ముందు ఏడవలేదు, అంటూ కన్నీళ్లతో తన కథను చెప్పి అందరిచేత కన్నీళ్లు పెట్టించాడు. ఈ సందర్బంగా ఫినాలేలో అతిథిగా వచ్చిన చెఫ్ సంజీవ్ కపూర్, మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎమోషన్స్‌కి దూరంగా పారిపోతూ ఇక్కడి దాకా వచ్చి వుంటావ్‌... ఇపుడిక  భావోద్వాగాల్ని కూడా మిళితం చేస్తూ కొత్త జీవితాన్ని మొదలు  పెట్టు ("అబ్ తక్ షాయద్ ఎమోషన్స్ సే భాగ్ కర్ యహాన్ తక్ పోహ్చే హో. ఆజ్ సే జిందగీ షురూ కరో, ఎమోషన్స్ సే జుడ్ కే") అని సలహా ఇచ్చారు.

తీవ్రమైన పోటీ మధ్య గౌరవ్ తన ఆవిష్కరణ, సాంకేతికత , నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచారు. సాంకేతిక సవాళ్లను నేర్చుకోవడం నుండి  ప్రస్తుతం వైరల్‌గా మారిన హనీకాంబ్‌ పావ్లోవా వంటి క్లిష్టమైన డెజర్ట్‌లను తయారు చేయడం వరకు, గౌరవ్  అతని పాక నైపుణ్యం, ప్రయాణం విశేషంగా నిలిచింది. అతని నటనా చాతుర్యంతోపాటు, వంటగదిలో నైపుణ్యం, ప్రావీణ్యం  ఆశ్చర్యకరమైన ప్రతిభ,  అభిమానులు . ఆహార విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.స్టార్-స్టడెడ్ పోటీదారుల జాబితాలో ఆయేషా జుల్కా, అభిజీత్ సావంత్, ఉషా నద్కర్ణి, అర్చన గౌతమ్, చందన్ ప్రభాకర్, కబితా సింగ్, దీపికా కాకర్ తదితరులు ఉన్నారు.

కాగా సెలబ్రిటీ మాస్టర్ చెఫ్  తొలి సీజన్‌ ఈ ఏడాది జనవరి 27న మొదలైంది.  ఏప్రిల్ 11న  ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో, నిక్కీ తంబోలిని తొలిరన్నరప్‌గా  నిలవగా, తేజస్వి ప్రకాష్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫైసల్ షేక్ , రాజీవ్ అడాటియా మొదటి ఐదుగురు ఫైనలిస్టుల జాబితాలో నిలిచారు. ఈ ఫైనల్‌కు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.సెలబ్రిటీ చెఫ్‌లు వికాస్ ఖన్నా,  రణ్‌వీర్ బ్రార్‌లతో కలిసి ఫైనలిస్టుల తుది వంటకాలను రుచి చూసి,విజేతలను ఎంపిక చేశారు.  ఫరా ఖాన్ హోస్ట్ చేసిన ఈ షో  కామెడీ,  వంటల మేళవింపుతో మధురక్షణాలతో రోలర్‌కోస్టర్‌గా సాగింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)