Breaking News

ప్రభుయేసు ఆగమనం

Published on Thu, 12/05/2024 - 11:28

విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్‌’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్‌’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.

దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో  పాల్గొని ‘క్రిస్మస్‌’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్‌’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.

క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో  ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6;  యెషయా 6 : 13).

ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).

కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన  ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో  పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ  ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.

– కోట  బిపిన్‌చంద్రపాల్‌

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)