Breaking News

చిరున‌వ్వుతో స్ఫూర్తిదాయక విజ‌యం!

Published on Thu, 04/30/2026 - 14:31

వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించింది శ్రీనగర్‌కు చెందిన జైనబ్‌ బిలాల్‌. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 10వ తరగతి ఫలితాల్లో ఈ దృష్టి లోపం ఉన్న విద్యార్థిని ఏకంగా 95 శాతం మార్కులతో సత్తా చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 500 మార్కులకు గాను జైనబ్‌ 475 మార్కులు సాధించింది. మరీ ముఖ్యంగా, ఆమెకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్‌ అయిన కంప్యూటర్ సైన్స్‌లో 100కు 100 మార్కులు సాధించడం విశేషం.

శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, లెర్నింగ్‌ రిసోర్స్‌ సెంటర్‌ విద్యార్థిని అయిన జైనబ్, ఈ విజయం ద్వారా ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి సహాయకునిపై ఆధారపడతారు. కానీ జైనబ్‌ ఎవరి సహాయం తీసుకోలేదు. నేరుగా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి పరీక్షలు రాసిన మొదటి అంధ విద్యార్థినిగా సరికొత్త చరిత్ర సృష్టించింద‌ని పీటీఐ వార్తా సంస్థ వెల్ల‌డించింది.

అంతేకాదు జైనబ్‌ బిలాల్‌ (zainab bilal) ఇతర రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తన 12వ ఏటనే రేడియో డీపీఎస్‌ కోసం మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేను సాధించగలిగినప్పుడు, ఎవరైనా సాధించగలరు. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకం ఉంచి, వారికి అండగా నిలబడితే చాలు’ అంటూ తన ఉత్తీర్ణత సందర్భంగా జైనబ్‌ ఇచ్చిన సందేశం ఎందరికో స్ఫూర్తిదాయకం.

మాటలు రావ‌డం లేదు
త‌న‌కు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్లాలని ఉంద‌ని జైనబ్‌ బిలాల్ తెలిపింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నట్టు ఆమె పీటీఐతో చెప్పింది. కాగా, చదువు పూర్తయ్యేంత వరకు అండగా నిలిచినందుకు తన పాఠశాలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. అడుగ‌డుగునా తోడుగా నిలిచిన త‌న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు రావ‌డం లేద‌ని పేర్కొంది.

 చ‌ద‌వండి: సీబీఎస్ఈ టెన్త్ టాప‌ర్లు వీరే

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)