Breaking News

గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే..

Published on Sun, 07/30/2023 - 08:02

గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్‌ జాన్సన్‌ అనే ఈ అమెరికన్‌ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్‌ వాళ్ల మాటలను పట్టించుకోలేదు.

తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది.

గ్రాంట్‌ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్‌ ఫ్లోరింగ్‌ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు.

(చదవండి: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్‌ చేస్తూ పెళ్లి..)

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)