Breaking News

బాలనెరుపా..? డోంట్‌ వర్రీ.. బట్‌ బీ కేర్‌ఫుల్‌...!

Published on Sat, 06/21/2025 - 11:45

పూర్వం రోజుల్లో జుట్టు కాస్త తెల్లబడితే, వయసు పైబడుతోందనడానికి సంకేతంగా భావించి దానిని హుందాగా తీసుకునేవారు. మరీ చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తే బాలనెరుపు కాబోలు అని సరిపెట్టుకునేవాళ్లు. ప్రస్తుత కాలంలో నెరుపు చిన్న వయసులోనే మొదలవుతోంది. అలాగని ఇప్పుడిదంతా మామూలే అని సరిపెట్టుకోవలసిన అవసరం లేదు. ఈ సమస్యకు మూల కారణాన్ని  కనిపెట్టి, దాన్ని సరిదిద్దుకుంటే, బాలనెరుపును దూరం చేసుకుని నిగనిగలాడే కురులను సొంతం చేసుకోవచ్చునంటున్నారు పరిశోధకులు. 

25 ఏళ్ల లోపు వయసులో కొందరికి తల మొత్తంగా అక్కడక్కడా వెంట్రుకలు నెరిస్తే, ఇంకొందరికి చెంపల దగ్గర, తలలో ఏదో ఒకచోట వెంట్రుకలు నెరుస్తాయి. అయితే అది ఎలాంటి నెరుపైనా  పాతికేళ్ల లోపు కనిపిస్తే కచ్చితంగా బాల నెరుపే! ఈ నెరుపు ఎవరికైనా రావొచ్చు.

కాలానుగుణ మార్పుల ప్రభావం
వాతావరణం, ఆహార కాలుష్యం, ఒత్తిడి... బాల నెరుపు తీవ్రత కాలక్రమేణా పెరగడానికి ప్రధాన కారణాలు! పూర్వంతో  పోల్చుకుంటే ఆహారంలో కృత్రిమత్వం పెరిగింది. వాతావరణంలో కాలుష్యమూ పెరిగింది. మానసిక ఒత్తిడికీ కొదవ లేదు. ఇవన్నీ కాలక్రమేణా బాల నెరుపు తీవ్రమవడానికి దారితీశాయి. 

ఇవీ కారణాలు: జన్యుపరంగా ఈ లక్షణం సంక్రమించి ఉంటే, తల్లితండ్రులకు ఏ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించాయో, అదే వయసుకు పిల్లల్లో కూడా మొదలవుతాయి.

పోషకాల లోపం ప్రధాన కారణం:  ప్రొటీన్స్‌ లోపం ఉన్నా, ఐరన్‌ తగ్గి అనీమియాకు లోనైనా, కాపర్‌ లోపం ఉన్నా వెంట్రుకలు తెల్లగా మారతాయి. ఈ లోపాల తీవ్రత ఏ వయసులో పెరిగితే ఆ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలవుతుంది. పిల్లల్లో ఈ సమస్య సర్వసాధారణం.  ఇంటి భోజనానికి బదులుగా బయటి చిరుతిళ్లు తినే పిల్లల్లో పోషకాహార లోపం చివరకు తెల్ల వెంట్రుకల రూపంలో బయల్పడుతుంది.

చదువు ఒత్తిడీ కారణమే:  ఇటీవలి కాలంలో పిల్లల్లో ప్రి మెచ్యూర్‌ గ్రేయింగ్‌ పెరగడానికి ప్రధాన కారణం చదువు ఒత్తిడి. మార్కుల కోసం, అదే పనిగా చదవమని ఒత్తిడి చేసినా, మెలనిన్‌   పరిమాణం తగ్గి వెంట్రుకలు తెల్లబడతాయి.

ఇదీ చదవండి: జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోల తగ్గింది..ఫేస్‌ గ్లో కోసం..!

కారణం తెలిస్తే చికిత్స సులువు: బాల నెరుపుకు అసలు కారణాన్ని కనిపెట్టగలిగితే సమస్య పరిష్కారం సులభమవుతుంది. ఇందుకోసం ఏ  పోషకలోపం ఉందో పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. థైరాయిడ్, అప్లాస్టిక్‌ ఎనీమియాలను గుర్తించే పరీక్షలూ చేయక తప్పదు. అలాగే ఈ నెరుపు వంశ పారంపర్యంగా సంక్రమించిందేమో గమనించాలి. జన్యు సమస్యలనూ అంచనా వేయాలి. పరీక్షల్లో ఇవేవీ కారణాలు కావని తేలితే ఒత్తిడిని ప్రధాన కారణంగా భావించాలి. 

పిల్లలకు బాల్యం నుంచే ఒత్తిడి లేని జీవితం గడిపేలా చూడాలి.  పౌష్టికాహారం ఇవ్వాలి. అప్పుడే బాలనెరుపును జయించవచ్చు. డోంట్‌ వర్రీ!
 

నో డైటింగ్‌, ఓన్లీ జాదూ డైట్‌ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!


 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)