Breaking News

300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..

Published on Mon, 05/05/2025 - 16:23

కొన్ని ఆలయాల చరిత్ర అత్యంత వింతగా ఉంటాయి. సాధారణంగా అందరూ దేవుడి ప్రసాదాన్ని అత్యంత పరమపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మాత్రం పిల్లులు స్వీకరించాక భక్తులకు పంచుతారుట. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఇది నమ్మశక్యంగానీ నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎ‍క్కడుంది..? దాని కథాకమామీషు ఏంటో చూద్దామా..!.

ఒడిశాలో దాదాపు 300 ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన మదన్ మోహన స్వామి పూజలందుకుంటున్నారు. ఆ స్వామి విగ్రహం తోపాటు పది ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ గుడి కేంద్రపారా జిల్లాలో ఉంది. 

ఈ ఆలయాన్ని ఒడిస్సాలో బిలేఖియా మఠం అని పిలుస్తారు. ఒడియా భాషలో పిల్లి 'బెలీ అంటారు. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం బిలేఖియాగా స్థిరపడింది. ఇక్కడ స్వామి మదన మోహన్‌కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ ప్రసాదాన్ని మొదటగా అక్కడే నివాసం ఉండే పది పిల్లులకు సమర్పించాక గానీ భక్తలకు వితరణ చేయరు. దాదాపు మూడు శతాబ్దాల  నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట ఆలయ పూజర్లు.

ఇలా ఎందుకంటే..
స్థానిక పురాణం ప్రకారం, ఆయుల్ రాజ్యానికి చెందిన రాజు బ్రజ సుందర్ దేబ్ ఈ మఠాన్ని సందర్శించాడు. ఆలయ పూజారి వందలాది పిల్లులను సంరక్షించడం చూశాడు. వెంటనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కొన్ని ఎకరాల భూమిని ఆ ఆలయానికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఆ ఆలయంలో ఆ పిల్లలకు ఆహారం పెట్టడం అనేది ఆచారంగా సాగుతోందట. 

అంతేకాదండోయ్‌ చాలావరకు ఆ పిల్లులన్ని ఆ ఆలయంలోనే పుట్టాయట. వాటికి రోజూ బిస్కెట్లు, పాలు, అన్నం తదితరాలు పెడతారట. ప్రస్తుతం ఆ పిల్లుల్లో చాలామటుకు ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చేసినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. అవన్నీ ఆలయ ప్రాంగణంలోనే తచ్చాడుతూ ఉంటాయి. 

అంతేగాదు ఆ పిల్లులు కూడా సరిగ్గా ప్రసాదం నివేదించే సమయాని కల్లా..పూజారి పెట్టే ప్లేటు వద్దకు వచ్చి నిరీక్షిస్తూ ఉండటం విశేషం. నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ ఈ ఆలయం స్టోరీ. పిల్లుల పోషణార్థం రాజు ఎకరాలకొద్దీ భూమిని రాసివ్వడం కూడా అత్యంత వింతగా అనిపిస్తోంది కదూ..!.

(చదవండి: మెట్ గాలా ఫ్యాషన్‌ ఈవెంట్‌లో ఆ ఆహారాలకు చోటు లేదు! రీజన్‌ ఇదే..)

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)