Breaking News

చొక్కాకు పూలకళ

Published on Sun, 04/26/2026 - 01:10

పూల డిజైన్లు కేవలం అమ్మాయిల దుస్తులపై మెరవడానికే అనుకుంటే,  మీరు చెవిలో పూలు పెట్టుకున్నట్టే! ఎందుకంటే, ఒక అబ్బాయి సరైన స్టయిల్‌లో పూల చొక్కా వేసుకుంటే, ఆ లుక్‌ ముందు ఎవరైనా సరే కాస్త సైడ్‌ అవ్వాల్సిందే! అది ఎలాగో మీరే చూడండి!

సందర్భాన్ని బట్టి పూల సైజ్‌ ఎంచుకోండి
పెద్ద పూల ప్రింట్స్‌ క్యాజువల్‌ ఔటింగ్స్, బీచ్‌ డేస్‌కు బెస్ట్‌. చిన్న పూల ప్రింట్స్‌ పార్టీలు లేదా సెమీ ఫార్మల్‌ ఈవెంట్స్‌కి క్లాసీ లుక్‌ ఇస్తాయి. ఎక్కువ మందికి పెద్ద పూల కంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉన్న పూల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. ఒక సిక్స్‌ ఫీట్‌ కటౌట్‌ ఉన్న అబ్బాయి రంగురంగుల పూల ప్రింట్స్‌ ధరిస్తే అది అతనిలోని ‘సాఫ్ట్‌ పవర్‌’ చెప్పకనే చెప్తుంది.

లైట్‌ అప్‌ ది కలర్స్‌
ఫేవరెట్‌ కలర్స్‌ కంటే ఎప్పుడూ సూట్‌ అయ్యే కలర్స్‌ మీ లుక్‌ను లైట్‌ అప్‌ చేస్తాయి. అందుకే, ఎలిగెంట్‌ లుక్‌ కోసం బ్లూ, బీజ్, బ్లాక్‌ లాంటి కలర్స్‌ బాగా సెట్‌ అవుతాయి. యెల్లో, పింక్, మింట్‌ గ్రీన్  కలర్స్‌ ఎనర్జీ, ఫన్  వైబ్‌ ఇస్తాయి. డార్క్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌పై లైట్‌ పూల డిజైన్  ఉంటే లుక్‌ మరింత షార్ప్‌గా కనిపిస్తుంది.

బాటమ్స్‌తో పర్ఫెక్ట్‌ బ్యాలెన్స్
పూల చొక్కాతో పాటు ప్లెయిన్  ప్యాంట్‌ లేదా జీన్స్ వేసుకుంటే లుక్‌ ఎక్కువ గందరగోళంగా కాకుండా నీట్‌గా కనిపిస్తుంది. ప్యాటర్న్‌ ఎక్కువైతే, మిగతా డ్రెస్‌ సింపుల్‌గా ఉంచండి. అలాగే, కూల్‌ లుక్‌ కోసం షార్ట్‌లు, బీచ్‌ వైబ్స్‌ కోసం లినెన్  షార్ట్‌లు, లోఫర్స్‌ ఫ్లోరల్‌ షర్ట్స్‌కు పర్ఫెక్ట్‌ బ్యాలెన్స్ ఇస్తాయి.

రఫ్డ్‌ గేమ్‌
అమ్మాయిలు పూల డ్రెస్సులు వేస్తే అది అలవాటు, అదే అబ్బాయిలు వేస్తే అది ఒక అడ్వెంచర్‌! ఆ అడ్వెంచర్‌ను మరింత రియలిస్టిక్‌గా చూపించడానికి, రఫ్‌గా ఉండే గడ్డం, హెయిర్‌కట్‌కు జతగా ఒక వైబ్రంట్‌ ఫ్లోరల్‌ షర్ట్‌ ఇచ్చే కిక్‌ వేరే లెవెల్‌!

డిజైనర్‌ షర్ట్‌
పూల చొక్కా వేసుకున్నప్పుడు మీరు గమనించాల్సింది, మీరు వేసుకున్నది డిజైనర్‌ షర్ట్‌లా హై క్వాలిటీతో ఉండాలి. కానీ, పొరపాటున అది మీ చెల్లెలి దుపట్టానో లేదా అమ్మ చీరనో కుట్టించుకున్నట్టుగా కనిపించకూడదు.

బటన్ల మ్యాజిక్‌
ప్లెయిన్‌ ప్యాంట్, స్లీవ్‌లెస్‌ బనియన్ పై ఓపెన్  ఫ్లోరల్‌ షర్ట్‌ లుక్‌కు ఒక ప్రత్యేకమైన వైబ్‌ ఉంటుంది. అలాగే, షర్ట్‌ పై బటన్లు రెండు వదిలేసి, చేతులు మడతపెట్టి పూల చొక్కాలో నడుస్తుంటే ఎవ్వరైనా మీపై నుంచి కళ్లు తిప్పుకోలేరు. అప్పుడు మీరు ‘నేనే వరల్డ్‌ హ్యాండ్సమ్, ఏమైనా సందేహమా?’ అన్నట్టుగా ఇచ్చే ఫొటో పోజులు కూడా అదిరిపోతాయి.

  • దీపిక కొండి

#

Tags : 1

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)