Breaking News

మాస్క్‌ల మాయాజాలం

Published on Sun, 02/08/2026 - 00:34

వెనిస్‌ వీథులు గత చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఆధునిక ప్రపంచపు కోలాహలాన్ని విడిచిపెట్టి ఒక్కసారిగా మధ్యయుగపు రాజవైభవంలోకి చేరిపోయాయి. బంగారు వర్ణపు పట్టు వస్త్రాలు, వెల్వెట్‌ గౌన్లతో పురాతన రాజులు, రాణుల వేషధారణతో స్ధానిక వీథులన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలోని వెనిస్‌ నగరం ఒక రంగుల హరివిల్లులా మారింది. ప్రతి మలుపులోనూ ముసుగుల సంబరాలు సందడిగా నడుస్తున్నాయి. ముసుగుల వెనక దాగి ఉన్న నవ్వులు, ప్రత్యేకంగా మెరిసే వస్త్రాలతో వెనిస్‌ నగరం తళుక్కుమంటోంది. కాలం వెనక్కి వెళ్లిందా అన్నంతగా ఈ సంబరం ఆకట్టుకుంటోంది.

ఈ పండగకు 864 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1162వ సంవత్సరంలో వెనిస్‌ గణతంత్ర రాజ్యం ఆక్విలేయాపై విజయం సాధించింది. దీనికి గుర్తుగా ప్రజలందరూ సెయింట్‌ మార్క్స్‌ స్క్వేర్‌ దగ్గర నృత్యాలు చేశారు. ఇదే కాలక్రమేణా కార్నివాల్‌ ఆఫ్‌ వెనిస్‌ ఫెస్టివల్‌గా మారిపోయింది. ఆనాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికీ అంతే జోరుతో కొనసాగుతున్నాయి. మధ్యలో కొన్నేళ్లు ఆగిపోయినా, 1979 నుంచి అధికారికంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ కార్నివాల్‌ కేవలం ఇటలీ సంప్రదాయంలా కాకుండా అంతర్జాతీయ పర్యాటక వేడుకగా మారిపోయింది.

ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇటలీలో 2026లో జరగనున్న మిలానో కార్టినా వింటర్‌ ఒలింపిక్స్‌ను పురస్కరించుకొని ఈ కార్నివాల్‌కు ఒలింపస్‌–ది ఆరిజన్స్ ఆఫ్‌ ది గేమ్‌ అనే థీమ్‌ను పెట్టారు. ఈ కార్నివాల్‌ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. ప్రధాన వేడుకలు మాత్రం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం అవుతాయి.

నిజానికి వెనిస్‌ నగరానికి కాలువలే ప్రధాన ఆకర్షణ. ఆ కాలువలే ఈ కార్నివాల్‌కు వేదికలు. ఈ కార్నివాల్‌లో జరిగే వేడుకలన్నీ కాలువల చూట్టూనే జరుగుతాయి. వీటిలో అత్యంత ఆకర్షణీయమైనది గ్రాండ్‌ వాటర్‌ పరేడ్‌. ఈ పరేడ్‌లో అద్దంలా మెరిసే వెనిస్‌ కాలువల్లో రంగురంగుల పడవలు వందలాదిగా కదులుతూ ఉంటాయి. ఈ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. వెనిస్‌ కార్నివాల్‌లో మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మనుషుల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఉత్సవంలో అందరూ కలిసి పాల్గొనేందుకు మాస్క్‌లు ధరిస్తారు. ఈ వేడుకలో బౌటా, మెడికో డెల్లా పెస్టే అనే మాస్క్‌లు చాలా ఫేమస్‌. వీటితో పాటుగా రాజులు, రాణులు మాదిరిగా స్థానిక కళాకారులు వేషాలు ధరిస్తారు. సెయింట్‌ మార్క్స్‌ బెల్‌ టవర్‌ నుంచి దేవదూత వేషధారణలో అమ్మాయి కిందకి దిగి వచ్చే ‘ఫ్లైట్‌ ఆఫ్‌ ది ఏంజెల్‌’ అనే ఘట్టం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. వెనిస్‌ కార్నివాల్‌ చూసేందుకు ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మంది పర్యాటకులు నగరానికి వస్తుంటారు. ఈ సమయంలో వెనిస్‌ నగరంలో ప్రత్యేకమైన విందులు, నాటక ప్రదర్శనలు, వాటర్‌ లైట్‌ షోలు ఉంటాయి. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)