Breaking News

షారుఖ్ ఖాన్‌ న్యూ జెన్ జెడ్ లుక్‌ అదిరిపోయిందిగా..

Published on Mon, 04/28/2025 - 13:04

ఫ్యాషన్‌కి స్టైల్‌కి పెట్టింది పేరు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). డైలాగ్‌  చెప్పినా, స్టెప్‌ వేసినా, బట్ట కట్టినా తనకంటూ ఒక స్టైల్‌ ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూల్ న్యూ జెన్ జెడ్(Gen-z) లుక్‌లో  అదిరిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సూపర్ స్టార్ ఇటీవల ముంబైలో అడుగుపెట్టినపుడు తన క్యాజువల్  వేర్‌లో వావ్‌ అనిపించాడు. ఎయిర్‌పోర్ట్ స్టైల్‌లో తెల్లటి టీ-షర్ట్, నీలిరంగు హూడీ జాకెట్, కార్గో ప్యాంటుకి జతగా కూల్ యాక్సెసరీస్ ధరించాడు. ఎప్పటిలాగానే  మోచేతులపైకి స్లీవ్‌లను మడిచి, జెన్-జెడ్ స్టేపుల్స్ ధరించి అదరహో అనిపించాడు. ఫ్యాషన్‌కు వయస్సు లేదని ఒకసారి నిరూపించాడు. ప్రస్తుతం Gen-Z  ఫాలో అవుతున్న బ్లూ కార్గో ప్యాంట్‌ ధరించి తగ్గేదే లే అన్నట్టు కనిపించాడు. యాక్సెసరీల విషయానికి వస్తే, బ్లాక్‌ సన్ గ్లాసెస్, క్రాస్‌బాడీ బ్యాగ్, వాచ్ , క్రిస్పీ వైట్ స్నీకర్లతో లుక్‌ను ఎలివేట్ చేశాడు. మెడలో  సిల్వర్‌  చెయిన్‌తో మరింత కూల్‌గా ప్రతి అంగుళం సూపర్‌స్టార్‌గా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్‌ కింగ్‌ ఖాన్‌  ఫ్యాషన్‌కి, స్టైల్‌కి  ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాలో  షేర్‌ అయిన షారూఖ్‌ వీడియో  నెటిజనులను ఆకట్టుకుంటోంది.

కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ యాక్షన్-థ్రిల్లర్ ‘కింగ్’  షూటింగ్‌ ఈ ఏడాది  జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. కింగ్ తో పాటు, అమర్ కౌశిక్‌తో కలిసి నటించిన అడ్వెంచర్ చిత్రం టైగర్ vs పఠాన్ ,రాజ్ & డికె  లాంటి ప్రాజెక్టులు షారూఖ్‌ చేతిలో ఉన్నాయి. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ మూవీలతో బాలీవుడ్‌లో తిరుగులేని హీరోగాఎదిగాడు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా అతని కరియర్‌లో బాజిగర్ ఒక మైలురాయి. ఈ సినిమాకు సండంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు ఈ మూవీకి ఫస్ట్‌ చాయిస్‌ షారుఖ్‌కాదట. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఇద్దరూ ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత మాత్రమే  ఈ అవకాశం ఎస్‌ఆర్‌కేకి దక్కిందట. ఈ విషయాన్ని  స్క్రీన్ రైటర్ రాబిన్ భట్ ఇటీవల వెల్లడించాడు.

ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)