Breaking News

కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్‌​..!

Published on Thu, 05/21/2026 - 14:01

బాలీవుడ్‌ బుల్లి తెర నటి మౌనీరాయ్‌ కూడా ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 79వ కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెరిశారు. ఇప్పటి వరకు అలియా భట్‌, అదితిరావు హైదరి, డయానా పెంటీ, నటి రుచి గుజ్జర్‌ తదితర తారాగణం అద్భుతమైన డిజైనర్‌వేర్‌లతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. తాజాగా వారి సరసన మౌనీరాయ్‌​ కూడా చేరారు. 

చెప్పాలంటే ఈ వేదికపై భారతీయ సాంప్రదాయ వారసత్వ కళలు తళక్కుమనడం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వారసత్వాలు తరతరాలు తెలుసుకునేలా అత్యద్భతంగా ప్రదర్శించారు పలువురు సెలబ్రిటీలు. ఇక మౌనీరాయ్‌ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలో పటోలా ప్రింట్ గౌనుతో తుళుక్కుమంది. 

ఈ ప్రపంచ వేదికపైనే ఆమె సినిమా పోస్టర్‌ టీజర్‌ని కూడా విడుదల చేశారు . గుజారాతీ పటోలా ఎండ్రాయిడరీ వర్క్‌ చేసిన ఈ గౌనులో మౌనీరాయ్‌ అత్యంత స్టైలిష్‌గా కనిపించారు. దీన్ని డిజైనర్‌  పూజా షా రూపొందించారు. ఈ డ్రైస్‌పై ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకు ఏకంగా 300 గంటల సమయం పట్టిందట. ఈ డ్రెస్‌ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే దుస్తుల లేబుల్‌కు చెందినది. 

వీపు భాగం లేకుండా పూర్తి నిడివి గల గౌనుని చేతులు లేని సిల్హౌట్‌ శరీరానికి హత్కుకుపోయే ఫిట్‌, స్క్వేర్‌ నెక్లైన్‌తో కలర్‌ఫుల్‌గా ఎంబ్రాయిడరీ చేశారు. అందుకు తగ్గట్టుగా కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గూలాబీ రంగు లిప్‌ షేడ్‌తో అందంగా కనిపించింది. 

(చదవండి: కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్‌ లుక్‌..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?)
 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)