Breaking News

నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..

Published on Fri, 07/04/2025 - 17:36

హాయిగా సాగిపోతున్న జీవితాన్ని భయానక వ్యాధులు ఒక్క ఊదుటన మొత్తం జీవితాన్నే తలికిందులు చేస్తాయి. వైద్యానికి అయ్యే ఖర్చులతో కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకొచ్చేస్తాయి. వీటన్నింటికి తోడు ఆ మహమ్మారి పెట్టే భయాన్ని తట్టకోవాలంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే. అలా అనితరసాధ్యమైన స్థైర్యంతో ఓ నాన్న కూతురు కోసం కేన్సర్‌ మహమ్మారిని ఎలా జయించాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. లెక్కలేనన్ని సర్జరీలు, బతుకుతానా లేదా అన్న నిరాశ నిస్ప్రహల నడుమ పోరాడి గెలిచిన ఓ తండ్రి కథ ఇది.

అతడే 60 ఏళ్ల అర్జున్ సేన్. అతడు మార్కెటింగగ్‌ ఎగ్జిక్యూటివ్‌, పాడ్‌కాస్ట్‌ హోస్ట్,‌ రచయిత, వ్యవస్థాపకుడు కూడా. కానీ అతడి జీవితం ప్రతిక్షణం మరణం అనే పంజాను విసురుతూనే ఉండేది. కానీ అది ప్రతిసారి అతడి నవ్వు ముందుకు ఓడిపోయింది. ఆయకు 1996లో, కడుపుకు మెటాస్టాసిస్ అనే స్వరపేటిక కేన్సర్‌ వచ్చింది. వైద్యులు వంద రోజులకు మించి బతికే ఛాన్స్‌ లేదని చెప్పేశారు. 

ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ వ్యాధి సోకినప్పడు అర్జున్‌కి 32 ఏళ్లు. వాస్తవానికి అర్జున్‌ అందరిని నవ్వించేవాడే..ఈ రోజు నిరాసనిస్ప్రుహలతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా అతడి కూతురు రాకా అతడిని చూసి.." నాన్న చనిపోవడం అంటే ఏమిటి, నువ్వు చనిపోతున్నావా..? మరి నా పెళ్లిలో డ్యాన్స్‌ చేయవా అంటూ అమాయకంగా అడిగిన కూతురు మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. 

కాసేపటికి తేరుకుని అప్పుడే పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నావ్‌ రా అనగానే కూతురు మోములోని సిగ్గు అతని ముఖంలోకి నవ్వు తెప్పించింది. పైగా కూతురిని దగ్గరకు తీసుకుని లేదు కచ్చితంగా నీ పెళ్లిలో ఈ నాన్న డ్యాన్స్‌ చేస్తాడు అని కూతురికి వాగ్దానం చేశాడు." అది అబద్ధమని తెలిసి కూడా అప్రయత్నంగా అర్జున్‌ ఆ మాటలు అనేశాడు. కానీ ఆ మాటలే ఆ తండ్రికి ఊపిరిపోశాయి..అప్పటి దాక ఉన్న బాధకు ఆ నవ్వు ఔషధంగా మారింది. 

తనకింకా వంద రోజుల కాదు వేల వందల 24 గంటలు ఉన్నాయన్నంత కొండంత ఆశను, ధైర్యాన్ని అందించాయి. అసలు ఈ మహమ్మారి ముందు చేతులు పైకెత్తేసి ఓడిపోవడం దేనికి పోరాడితే ఏముంది అనే శక్తిమంతమైన ఆలోచనను రేకెత్తించింది. ఆ ధైర్యంతోనే కీమోథెరపీ చికిత్సలు తీసుకునేవాడు..ప్రతిసారి ట్రీట్‌మెంట్‌కి వెళ్లినప్పుడూ తాను బయటపడతానా అనే ప్రశ్న.. వైద్యులను అడిగేవాడు..వాళ్లు కూడా బి పాజిటివ్‌ అనేవారే తప్ప..పర్లేదు బయటపడగలవు అనే భరోసా ఇచ్చేవారు కారు. 

అయినా సరే అర్జున్‌కి తన కూతురు రాకా కోసం బతికి బట్టగట్టగాలి అనే మొండి ధైర్యాన్ని కొని తెచ్చుకుని మరి చికిత్స తీసుకునేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 20 సర్జరీలు చేయించుకున్నాడు. మంచి చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి కూతురికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. 

అంతేగాదు అతడి గాథని పికూ (2015), విక్కీ డోనర్ (2012) మూవీల దర్శకుడు షూజిత్ సిర్కార్ ఐ వాంట్ టు టాక్ మూవీగా తెరకెక్కించాడు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ల మధ్య సైలంట్‌గా సాగే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. బాక్సాపీస్‌ వద్ద విమర్శకుల ప్రశంసలందుకుంది కూడా.  అసలు ముందు మనమే సమస్యకు భయపడిపోతే ఎలా మన కంటి పాపల కోసమైన మృత్యువుతో పోరాడే చిన్న ‍ప్రయత్నమైనా.. చేయాలి అని చాటిచెప్పే భావోద్వేగ కథ ఇది.

(చదవండి: కపిల్‌ శర్మ వెయిట్‌ లాస్‌​ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్‌..?)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)