Breaking News

మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చే‍యగలవు!

Published on Tue, 12/26/2023 - 13:34

రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్‌లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు.

మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..!
బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.

అంతేగాదు వారు నిహిత్ మెషిన్‌ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్‌. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్‌ సమస్యకు చెక్‌పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్‌ మిషన్‌తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు.

(చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)