Breaking News

ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్‌‍ కాగలరా? ఇది సాధ్యమేనా!

Published on Mon, 07/24/2023 - 15:32

మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్‌ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్‌ఫెటేషన్‌ అని పిలుస్తారని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్‌ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి.

ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్‌ఫెటేషన్‌ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్‌ హిల్‌ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది.

ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్‌ఫెటేషన్‌ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్‌ఫెటేషన్‌కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!)

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)