Breaking News

యాంటీ సూట్‌ ఇంజక్షన్‌ కేసు: విదేశాల్లో డైవర్స్‌ కేసు వేస్తే..!

Published on Wed, 12/04/2024 - 13:07

నాకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలవుతోంది. నా భర్త అమెరికాలో ఉద్యోగి. పెళ్లి అయిన తర్వాత నేను కూడా అమెరికాకు వెళ్లాను. అమెరికాలోనే ఒక కొడుకు పుట్టాడు. తర్వాత మాకు మనస్పర్ధలు వచ్చాయి. నన్ను నానారకాల హింసలు పెట్టి అత్తింటి వాళ్లు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. అమెరికాలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. తప్పని పరిస్థితులలో తిరిగి భారతదేశానికి వచ్చేశాను. నా భర్త అమెరికాలో డైవర్స్‌ కేసు వేశారు అని నాకు నోటీసు వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కేసు వాదించే ఆర్థిక పరిస్థితులలో లేను. నాకు డైవర్స్‌ వద్దు. తగిన సలహా ఇవ్వగలరు. 
– సరళ, విజయవాడ

మీ పరిస్థితి నాకు అర్థం అయింది. మీరు అమెరికాకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పెళ్లి భారత దేశంలో జరిగింది అని చె΄్పారు. పెళ్లి తర్వాత కొంతకాలం అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో కూడా డైవర్స్‌ కేసు వేయవచ్చు అనేది సాధారణ చట్టం. కానీ ఆ డ్డైవర్స్‌ ఇండియాలో చెల్లాలి అంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీ కేసులో మీరు అమెరికా ΄పౌసత్వం తీసుకోలేదు అని అనుకుంటున్నాను. 

మీరు ఇరువురు భారతీయ ΄పౌరులు అయి ఉండి, భారతీయ చట్టాల ప్రకారం మీ వివాహం జరిగి ఉంటే, అదనంగా రిజిస్టర్‌ కూడా చేయబడి ఉంటే కనుక భారతదేశంలో తగిన చర్యలు తీసుకునే వీలు ఉంది. మీ దగ్గరలోని న్యాయవాదిని కలిసి ‘యాంటీ సూట్‌ ఇంజక్షన్‌’ వేయమని అడగండి. అయితే మీ కేసులో యాంటీ సూట్‌ ఇంజక్షన్‌ వేయవచ్చా లేదా అనేది కేసు పూర్వపరాలు చూసిన తర్వాత నిర్ణయించవలసి ఉంటుంది. ఆ కేసు ద్వారా, మీ భర్తపై భారతీయ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. 

అతను వేరే ఏ దేశంలో కూడా మీ వివాహానికి సంబంధించిన కేసులు వేయడానికి లేదు అని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే, తాత్కాలికమైన ఆదేశాలు లభించినప్పటికీ, శాశ్వతంగా మీరు కేవలం భారతదేశ కోర్టులో మాత్రమే కేసులు వేయాలి అని అన్నివేళలా కోర్టులు చెప్పకపోవచ్చు. అందుకే మీ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికి మీరు మీ భర్తని డైవర్స్‌ కేసు వేయకుండా ఆపడానికి, యాంటీ సూట్‌ ఇంజక్షన్‌ కేసు వేయండి.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

(చదవండి: టీన్‌ప్రెన్యూర్స్‌: తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగకపోయినా..!)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)