Breaking News

తామర పువ్వులు తింటే.. నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?

Published on Wed, 07/22/2026 - 17:53

బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ఒడిస్సీ ఫస్ట్‌ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్ర భారత్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 7.78 కోట్లు వసూల చేయడం విశేషం. ఆ మూవీలో జన్ వార్ తర్వాత ఒడిస్సియస్ సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు యలుదేరతాడు. పది రోజుల్లో చేరుకోవాల్సిన ప్రయాణం పదేళ్లు పడుతుంది.ఆ మధ్యలో ఓగిగియా అనే పౌరాణిక ద్వీపంలో చిక్కుకోవడంతో ఇలా జరుగుతుంది. 

ఆ ద్వీపంలో  కాలిప్సో అనే అప్సరస అతనిపై మనుసుపడి..అక్కడే ఉంచేసుకుందామనే దురుర్దేశంతో నీలి తామరపువ్వుని తినిపించడంతో జ్ఞాపకశక్తిని కోల్పోయి ఇబ్బంది పడినట్లుగా చూపిస్తారు. మరి ఇంతకీ నిజంగా తామరపువ్వులు లేదా కలువలు తింటే నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?, నిజంగానే నీలి తామర పువ్వులు అనారోగ్యకరమైనవా అంటే..

'ది ఒడిస్సీ' (The Odyssey) అనే ప్రసిద్ధ గ్రీకు పురాణ కథలో, తామర పూలు (Lotus-eaters) తిన్నవారు తమ గతాన్ని, జ్ఞాపకాలను మర్చిపోయి హాయిగా జీవిస్తారని రాశారు. అలాగే మన భారతీయ పురాణాల్లో సైతం దీనికి అగ్రస్థానం ఇచ్చారు. దేవతలను ఈ పూలతో పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాయణ, భారత ఇతి హాసాల్లో సైతం ఈ పువ్వుల గొప్పతనం గురించి రాసి ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన దేవతాపుష్పాలు తింటే జ్ఞాపకశక్తి పోవడం ఖాయమా? అంటే..

తామర పువ్వులు, వేర్లు మరియు గింజలు జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేయవు. వాస్తవానికి, ఆసియా దేశాల సాంప్రదాయ వైద్యంలో తామర మొక్కలోని వివిధ భాగాలను నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

అయినప్పటికీ, బ్లూ లోటస్ (Blue Lotus) వంటి కొన్ని ప్రత్యేక తామర జాతులను అధికంగా తీసుకుంటే, వాటిలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల కొద్దిసేపు స్పృహ తప్పినట్లు, హాయిగా లేదా కొద్దిగా మత్తుగా అనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి

ఈజిప్షియన్ బ్లూ లోటస్, దీనిని బ్లూ వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారు, ఇందులో న్యూసిఫెరిన్ మరియు అపోర్ఫిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్ సెరోటోనిన్ రిసెప్టర్లతో సంకర్షణ చెందుతాయి. ఈ సమ్మేళనాలు తేలికపాటి ఉల్లాసం, విశ్రాంతి, ప్రశాంత, ఆందోళన, పారానోయా, మానియా, ఇతర న్యూరోసైకియాట్రిక్ లక్షణాల వరకు ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ, మానవులపై  దాని ప్రభావంపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. 

అయితే, కొన్ని మొక్కలలో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని ఆల్కలాయిడ్లు, మరికొన్ని సమ్మేళనాలు ఉన్నాయని గుర్తించారు. తామరపువ్వు ఇలాంటి ప్రమాదం చూపించనప్పటికీ..జ్ఞాపకశక్తి లోపం, గందరగోళం, మతిభ్రమణం , బ్రాంతులకు కారణమయ్యే ఇతర మొక్కలు ఉన్నాయనేది గుర్తురెగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

(చదవండి: IVF journey.: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్‌ జర్నీపై నటి షాకింగ్‌ వ్యాఖలు)



 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)