Breaking News

పిల్లలకు బహుమతిగా ఇచ్చినా తిరిగి తీసుకోవచ్చు...

Published on Sat, 07/20/2024 - 11:10

పిల్లలు ఎదిగేంతవరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డాక ఇంకా ఈ బరువు బాధ్యతలు ఎందుకు... ప్రశాంతంగా వారి వద్ద గడిపేద్దాంలే అని ఉన్న ఆస్తులను వారికే పంచేస్తారు.కానీ, ఆస్తులను పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తులను తీసుకొని, ఇంటినుంచి గెంటేస్తే.. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో తరచూ వృద్ధులకు సంబంధించి వచ్చిన వార్తల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటోంది. వృద్ధుల ఆస్తులకు సంబంధించి రక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయో... తెలుసుకుందాం.

మహబూబాబాద్‌ జిల్లా గార్ల గ్రామంలోని జెండా బజారుకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఉన్న మూడెకరాల భూమిని కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని కూలగొట్టి తల్లికి గూడు లేకుండా చేశారు. ఆస్తి పంచుకునే ముందు కొడుకులు నెలకు ఒకరి చొప్పున అమ్మను సాకుతామని ఒప్పందం చేసుకున్నారు. తీరా ఆస్తి పంచిన తర్వాత అసలు అమ్మ విషయాన్నే గాలికి వదిలేశారు. దాంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారిలో దయగల తల్లి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని, ఎవరో ఒకళ్ల ఇంటి అరుగులపై తలదాచుకోవలసి వస్తోందా వృద్ధురాలు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్, ఆస్తిని తీసుకుని తల్లిని వదిలేసిన కుమారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిని ΄ోషించాలని, లేదంటే ఆమె పంచి ఇచ్చిన యావదాస్తిని తిరిగి తల్లికి చెందేటట్లుగా చేస్తామని వారిని హెచ్చరించారు. 
 
సీనియర్‌ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007లోని (సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌) సెక్షన్‌ 23(1) తల్లిదండ్రుల ఆస్తిని రక్షిస్తుంది. మోసాన్ని నిరోధించి, ్రపాథమిక సౌకర్యాలను కోల్పోకుండా పరి రక్షిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా ఈ హక్కులపై సీనియర్‌ సిటిజన్స్‌కు అవగాహన అంతంత మాత్రమే. సీనియర్లు తమ ఆస్తిని పంచి ఇచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్‌ ద్వారా ఆస్తి బదిలీని రద్దు చేసుకునే ఆవకాశంఉంది.

 ఆస్తిని తిరిగి ΄పోందవచ్చు... 
తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచించే వయోవృద్ధులైన తల్లిదండ్రులు ట్రాన్స్‌ఫర్‌ డీడ్‌లో ఒక ఎక్స్‌ప్రెస్‌ షరతును చేర్చవచ్చు. ఆస్తిని బహుమతిగా తీసుకున్న పిల్లలు ఈ షరతును ఉల్లంఘిస్తే, ఆ బహుమతి చెల్లుబాటు కానిదిగా ప్రకటించి, తల్లిదండ్రులు మెయింటెనెన్స్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. తల్లిదండ్రులు ప్రేమ, ఆ΄్యాయతతో లేదా సేవలకు బదులుగా పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని సూచించవచ్చు. అయితే, అస్పష్టతకు తావు లేకుండా ఎక్స్‌ప్రెస్‌ షరతును చేర్చడం ఉత్తమం అని పేర్కొన్నాయి.

  ఇంటినుంచి తరిమివేయవచ్చు
సీనియర్‌ సిటిజన్ల ఆస్తుల నుంచి పిల్లలు లేదా ఆస్తి తీసుకున్న బంధువులను తొలగించడానికి సుప్రీం కోర్టుతో సహా కోర్టులు అనుమతించాయి. చట్టబద్ధమైన వారసులమనే కారణంతో తల్లిదండ్రులను వేధిస్తే ఇంటినుంచి బయటకు పంపివేయవచ్చని కూడా ఆదేశించింది.

 ముఖ్యమైన గమనికలు
⇒ ఆస్తిలో ఆర్థిక పెట్టుబడులు, కాపీరైట్‌లు, పేటెంట్లు, ఆభరణాలు, కళాఖండాలు మొదలైనవి ఉండచ్చు. ∙ఆస్తుల వివరాలతో΄ాటు బ్యాంక్, డీమ్యాట్‌ ఖాతాలు, ఎమ్‌ఎఫ్‌లు, షేర్లు, ఎఫ్డీలు, బీమా పాలసీలు, లోన్లు.. మొదలైన వాటి జాబితా కోసం న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదింపు అవసరం. అందుకని వారి వివరాలను తీసుకోండి.  వారసత్వం, ఆస్తుల ప్రణాళికలో కీలకమైన భాగం వీలునామాను రూపోందించడం. దాని చెల్లుబాటును నిర్ధారించడానికి కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి... ఆస్తులకు సంబంధించిన వివరాలు, కంపైల్‌ చేయాల్సిన సమాచారంలో ఇద్దరు సాక్షులను, ఒక ఎగ్జిక్యూటార్‌ని నియమించుకోవాలి.
 ⇒వీలునామాలో మీ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వారి పేర్లను విధిగా నమోదు చేయాలి. లేకుంటే తర్వాత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.  

అవగాహన అవసరం
వృద్ధుల రక్షణ చట్టం గురించి అవగాహన మన దేశంలో చాలా మందికి లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులు కూడా తమ సమస్యను చట్టం దృష్టికి తేవాలి. ఆస్తులు లేక΄ోయినా వృద్ధ తల్లిదండ్రులు  మెయింటనెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
– ఎ.పి.సురేష్, సీనియర్‌ అడ్వకేట్, హైకోర్ట్‌ 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)