ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్‌ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..

Published on Wed, 07/23/2025 - 14:38

చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న సినిమా ‘సయ్యారా’ (Saiyaara). మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అహాన్‌ పాండే సంగీతకారుడు క్రిష్‌కపూర్‌గా, హీరోయిన్‌గా అనీత్‌ పద్దా  ఆశావహ జర్నలిస్ట్‌ వాణి బాత్రాగా నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్‌ ప్రేమ కథ ఇది. ఇందులో వాణిబాత్రా పాత్రలో ఒదిగిపోయిన 22 ఏళ్ల అనిత అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు చూపిస్తాడు దర్శకుడు. ఆ వ్యాధి కారణంగా వాణి క్రిష్‌ మద్య సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని చుట్టూ సాగుతుంది ఈ సినిమా. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌ మాదిరిగా చిన్న వయసులోనే అల్జీమర్స్‌ వ్యాధి బారినపడతామా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇది 60 ఏళ్లు పైబడ్డాక వచ్చే వ్యాధి. మరి చిన్నవయసులోనే ఈ వ్యాధిబారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయా అంటే..

సినిమా కాబట్టి అలా కథ కోసం హీరోయిన్‌ చిన్న వయసులోనే అల్జీమర్స్‌ వ్యాధి బారినపడినట్లు చూపించారా..? లేక వాస్తవికంగానే అది నిజమా అంటే..ఔననే చెబుతున్నారు నిపుణులు. ఈ అల్జీమర్స్‌​ వ్యాధి 65 ఏళ్లు పైబడిన వారికి వచ్చినప్పటికీ..కొన్నిసార్లు 30 లేదా 40 ఏళ్ల వారిని కూడా ప్రభావితం చేస్తుందట. 

అయితే 20 ఏళ్లలోపు వ్యక్తుల్లో మాత్రం అరుదుగా కనిపిస్తుందని చెప్పారు. తక్కువ వయసులోనే ఈ సమస్య బారినపడిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందట. ప్రధానంగా APP TSEN వంటి జన్యువులలో ఉత్పరివర్తనల కారణంగా చిన్న వయసులోనే ఆ వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఆ మూవీలో వాణి పాత్రలో ఒదిగిపోయిన హీరోయిన్‌లా అపస్మారక స్థితి, తలతిరగడం,  జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవని అన్నారు. పైగా ఈ లక్షణాలు అల్జీమర్స్‌ వ్యాధిలో భాగం కాదని కూడా చెప్పారు. 

లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • ఇటీవలే జరిగిన సంభాషణలు లేదా సంఘటనలు మర్చిపోవడం

  • వస్తువులను తప్పుగా ఐడెంటిఫై చేయడం

  • ఒక ప్రదేశం లేదా వస్తువుల పేర్లను మర్చిపోవడం

  • ఆలోచించడంలో ఇబ్బంది పడటం

  • పదేపదే ప్రశ్నించడం

  • కొత్త విషయాలను ప్రయత్నించడానికి సంకోచించడం

  • నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం

అలాగే ఆ సినిమాలో తన భర్తను చూడగానే వాణి తన వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకుంటున్నట్లు చూపించారు. కానీ రియల్‌గా అలా జరగదు. అంత స్పీడ్‌గా రికవరీ కావడం జరగదని చెప్పుకొచ్చారు నిపుణులు. వృద్ధాప్యంలో వచ్చే చిత్తవైకల్యానికి కారణం డిప్రెషన్‌ అయితే..చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడటానికి జన్యు సంబంధిత సమస్యలే కారణమని అన్నారు. 

పైగా దీన్ని కరెంట్‌ షాక్‌తో ట్రీట్‌మెంట్‌ చేయరని కూడా చెప్పారు. అయితే ఈ మూవీ జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని ముందుగా గుర్తించాలనే విషయాన్ని హైలెట్‌ చేసింది. దీన్ని గనుక గమనించనట్లయితే అల్జీమర్స్‌ వ్యాధి తీవ్ర స్థాయికి చేరకమునుపే ఆయా పేషెంట్లను మందులు, కౌన్సిలింగ్‌లతో తర్వితగతిన నయం చేయగలుగుతామని అన్నారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)