Breaking News

క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?

Published on Mon, 07/01/2024 - 16:53

క్యాబేజీ అంటే చాలామంది పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే దీనివాసన  చాలామందికి నచ్చదు. అయితే క్యాబేజీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడం నుంచి అనేక సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అయితే క్యాబేజీ ఆకులతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా?

క్యాబేజీ ఆకులను యూరోపియన్ జానపద వైద్యంలో పేదవారి పౌల్టీస్ (పిండికట్టు) అని పిలుస్తారు. వృద్ధులలో అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి  ఆస్టియో ఆర్థరైటిస్. అలాంటి వారు క్యాబేజీ ఆకులను పాదాలకు చుట్టి రాత్రంతా ఉంచడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు పెయిన్ కిల్లర్స్ కన్నా అద్భుతంగా పనిచేస్తాయని, ఈ ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వీటిని కొద్దిగా నూనెతో వేడిచేసి కానీ, ఐస్‌తో కలిపి ఐస్‌ ప్యాక్‌లాగా గానీ వాడతారు. 

ఇవి సురక్షితమైనవి, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు కాబట్టి  దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు. ధూమపానం చేసేవారు క్యాబేజీ లేదా బ్రోకలీని తిన్న పది రోజుల తర్వాత వారి సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు 40 శాతం తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది.

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 81 మంది వ్యక్తులపై 2016లో ఒక చిన్న అధ్యయనం జరిగింది, అక్కడ మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు క్యాబేజీ ఆకు చుట్టడం ద్వారా  ఫలితం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.  అయితే దీని నిర్ధారణకు "మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. 2018లో చేసిన మరొక అధ్యయనంలో పురుషులలో మోకాలికి  ఐస్‌తో పాటు, క్యాబేజీ ఆకులను  చుట్టి కట్టడం వలన వాపు తగ్గినట్టు గమనించారు. 

నోట్‌: ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి.  సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది. 

 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)