Breaking News

Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్‌

Published on Thu, 04/04/2024 - 00:55

ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్‌ బిల్డింగ్‌లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్‌ బటర్‌ఫ్లై మామ్‌ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు.
 
ప్రియాంక సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్‌ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్‌లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది.

బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి.

అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్‌ ఇండియన్‌ జాస్మిన్‌... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్‌ బటర్‌ఫ్లై, కామన్‌ జాయ్, లైమ్‌ స్వాలోటెయిల్‌ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి.

ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్‌ను బటర్‌ ఫ్లై మామ్‌ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్‌. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్‌లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)