Breaking News

బెరుకులేని చదువే... బెంచ్‌..మార్క్‌!

Published on Sat, 06/13/2026 - 06:11

ఫస్ట్‌ బెంచ్‌ నుంచి లాస్ట్‌ బెంచ్‌ దాకా  నవ్వులు కనిపిస్తున్నాయి. కానీ ఆ నవ్వుల మధ్యలో  కొన్ని మొహాలు డల్‌గా ఉన్నాయి.  ఒకడు ఒంటరిగా లంచ్‌ చేస్తున్నాడు.  ఒక గర్ల్‌ స్టూడెంట్‌ బాత్రూమ్‌కి వెళ్లాలన్నా భయపడుతోంది. వెనక బెంచీలో ముగ్గురు  ముందు బెంచీ వాడిని చూస్తే బెదిరిపోతున్నారు. టీచర్లకు చెప్పాల్సిన సిలబస్‌ మాత్రమే కనిపిస్తుంది. కానీ బెంచీల మధ్య జరిగే ‘సైలెంట్‌ వార్‌’ కనిపిస్తోందా? క్లాస్‌లో మనసులన్నీ సేఫ్‌గా ఉన్నాయా? బుల్లీయింగ్‌ జరుగుతున్నదేమో చూశారా?

స్కూళ్లు తెరుస్తారు. పాఠాలు మొదలవుతాయి. పిరియడ్‌కూ పిరియడ్‌కూ మధ్య టంగు టంగుమంటూ గంట ఉంటుంది. కానీ పిల్లల ప్రపంచంలో అసలు పాఠం బ్రేక్‌ టైమ్‌లో మొదలవుతుంది. ఎవరో ఎవరితోనో ‘ఇక్కణ్ణుంచి లే’ అంటారు. ఎవరి వాటర్‌ బాటిల్‌నో ఎవరో విసిరేస్తారు. ఎవరి పేరునో మరొకరు ఫన్నీగా పిలిచి ఏడిపిస్తారు. బుల్లీయింగ్‌.. గ్రూపిజం... నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. 

‘వాడు మనోడు కాదు’...‘వాడి షూస్‌ బ్రాండెడ్‌ కాదు’... ‘నీకు ఇంగ్లీష్‌ రాదు’.. ‘నీ ర్యాంక్‌ తక్కువ’... పిల్లల మధ్య మాటలు ఎక్స్ఛేంజ్‌ అవుతుంటాయి. పేరెంట్స్‌కి ఇవి తెలీవు. ప్రిన్సిపాల్‌ దగ్గరికి కంప్లైంట్‌ వెళ్లదు. ఎందుకంటే బాధ పడే పిల్లాడు భయంతో చెప్పడు. మరి ఎవరు కనిపెట్టాలి? క్లాస్‌లో 40 నిమిషాలపాటు వాళ్లతో ఉండే టీచరే. పిల్లాడి మనసులో గాయాల్ని చూసే ఫస్ట్‌ కౌన్సెలర్‌ టీచరే.

→ చివరి బెంచీ పిల్లాడు సైలెంట్‌ ఎందుకు?
ఆ చివరి బెంచీ పిల్లాడు ఏది అడిగినా జవాబు చెప్పడు. మౌనంగా ఉంటాడు. వాడొక ‘మొద్దు’ అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం వేరే ఉండొచ్చు. వాడి డ్రెస్‌ చిరిగిపోయిందని ముందు బెంచీ వాళ్లు నవ్వారేమో. నత్తిగా మాట్లాడతాడని వెనక నుంచి ‘సౌండ్‌’ చేస్తున్నారేమో. లంచ్‌టైమ్‌లో వాడి బాక్స్‌ లాగేసి పరిగెత్తారేమో. వాడి సైలెన్స్ కు కారణం చదువురాక కాదు, భయం. 

ఇలా బాధ పడుతున్న పిల్లలను ఎలా కనిపెట్టాలి? క్లాస్‌లో గ్రూప్‌ యాక్టివిటీ ఇవ్వండి. ‘ఇష్టమైన వాళ్లతో గ్రూప్‌ చేసుకోండి’ అనండి. మీరే లెక్కపెట్టి గ్రూప్స్‌ విడదీయండి. అప్పుడు ఒకరిద్దరు మిగులుతారు. అంటే వారిని అందరూ కలిసి సైడ్‌ చేశారన్నమాట. అలాంటి పిల్లలతో విడిగా మాట్లాడండి. ‘నీకు ఏమైనా ప్రాబ్లమా?’ అని డైరెక్ట్‌గా అడగొద్దు. ‘నీకు ఏ గేమ్‌ ఇష్టం?’ అని స్టార్ట్‌ చేయండి. నమ్మకం వస్తే నిజం చెప్తాడు. చివరి బెంచీ సైలెన్స్ ని మీరు బ్రేక్‌ చేస్తే, వాడి లైఫ్‌లో ఫస్ట్‌ సౌండ్‌ మీరే అవుతారు.

→ ‘కంప్లయింట్‌ బాక్స్‌’ ఉండాలి
‘మా క్లాస్‌లో అందరం బాగున్నాం సార్‌’ అని పిల్లలంతా అంటారు. ఎందుకంటే బుల్లీ చేసేవాడి ముందు ఎవరూ నోరు విప్పరు. అందుకే క్లాస్‌లో ఒక ‘మాటల డబ్బా’ పెట్టండి. పేరు అవసరం లేదు. చీటీ మీద ‘నన్ను ఎవరో కొడుతున్నారు’ అని రాసి వేసినా చాలు. ‘ఫలానా వాడు నా పెన్‌ విరగ్గొట్టాడు’ అని రాసినా చాలు. వారానికి ఒకసారి మీరు మాత్రమే ఆ డబ్బా ఓపెన్‌ చేయండి.

 పేర్లు బయటికి చెప్పొద్దు. కానీ ఆ తప్పు చేసిన వాడిని విడిగా పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వండి. ‘ఇది తప్పురా. మళ్లీ చేస్తే ప్రిన్సిపాల్‌కి చెప్పాల్సి వస్తుంది’ అని వార్నింగ్‌ ఇవ్వండి. బాధ పడ్డ పిల్లాడికి ‘నేనున్నా’ అనే ధైర్యం ఇవ్వండి. ‘కంప్లైంట్‌ బాక్స్‌ అంటే మన స్కూల్‌ పరువు పోతుంది’ అని కొందరు అంటారు. కానీ నిజం ఏంటంటే, ఆ డబ్బా ఉండబట్టే పరువు నిలబడుతుంది. ఎందుకంటే సమస్యని దాచిపెడితే పెద్దదవుతుంది. బయటికి తీస్తే పరిష్కారం అవుతుంది. టీచర్‌గా మీరు కోర్ట్‌ కాదు, కౌన్సెలింగ్‌ సెంటర్‌.

→ వేధించే పిల్లాడిని ఏం చేయాలి?
బుల్లీ చేసిన పిల్లాడి పేరెంట్‌ని పిలిపించడం ఈజీ. కానీ మాట్లాడటం కష్టం. ఎందుకంటే ‘మా వాడు అలాంటోడు కాదు’ అని వాళ్లు ముందే డిఫెన్స్ లోకి వస్తారు. అందుకే ఈ మూడు రూల్స్‌ పాటించాలి.

నేరం మోపొద్దు: ‘మీ అబ్బాయి రౌడీలా తయారయ్యాడు’ అనకండి. ‘క్లాస్‌లో ఒక సంఘటన జరిగింది. మీ అబ్బాయి కూడా అందులో ఉన్నాడు. మనం కలిసి సరిచేద్దాం’ అనండి. ‘మనం’ అనే మాట వాళ్లకి మీరు విలన్‌ కాదు, ఫ్రెండ్‌ అని అనిపిస్తుంది.

పిల్లాడి ముందు పంచాయితీ వద్దు: పేరెంట్‌ని, పిల్లాడిని కలిపి కూర్చోబెట్టి ‘ఏరా నువ్వు చేశావా?’ అని అడగొద్దు. వాడు భయంతో ‘లేదు’ అంటాడు లేదా మొండిగా ‘అవును’ అంటాడు. ముందు పేరెంట్‌తో విడిగా మాట్లాడండి. తర్వాత పిల్లాడితో విడిగా మాట్లాడండి.

సొల్యూషన్ తో ముగించండి: ‘ఇంకోసారి చేస్తే టీసీ ఇచ్చేస్తాం’ అని బెదిరించొద్దు. ‘మీవాడికి ఊపు ఎక్కువ. సాయంత్రం ఆటలకి పంపించండి. ఎనర్జీ అక్కడ రిలీజ్‌ అవుతుంది’ అని సలహా ఇవ్వండి. మీరు పేరెంట్‌కి శత్రువు కాదు, వాళ్ల పిల్లాడి భవిష్యత్తుకి మీరు పార్టనర్‌ అని ప్రూవ్‌ చేయండి. అప్పుడే ఇంటిదగ్గర కూడా మార్పు వస్తుంది.

→ చివరిమాట
క్లాస్‌లో 40 మంది పిల్లలుంటే వారు 40 మార్కుల లిస్టులు కాదు, మనసులని గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌ బెంచీ పిల్లాడి కంట్లో భయం, ఫస్ట్‌ బెంచీ పిల్లాడి కళ్లలో అహంకారం రెండూ డేంజరే. రెండిటికీ మందు మీ దగ్గరే ఉంది. అదే ‘పట్టించుకోవడం’. పాఠం మొదలుపెట్టే ముందు, ఒకసారి క్లాస్‌ మొత్తం చూడండి. ఎవరి మొహంలో బెరుకు ఉందో కనిపెడితే చాలు. బెంచీల మధ్య దూరం పోతుంది. అప్పుడు బ్లాక్‌బోర్డ్‌ మీద మీరు ఏం రాసినా వాళ్ల గుండెల్లోకి చేరుతుంది. ఎందుకంటే సేఫ్‌గా ఫీల్‌ అయిన పిల్లాడే షార్ప్‌గా నేర్చుకుంటాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)