Breaking News

కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!

Published on Sun, 11/03/2024 - 10:42

కింగ్‌ చా​ర్లెస్‌, కెమిల్లా  దంపతులు ఇటీవల బెంగూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాజ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని సౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ సెంటర్‌ని కూడా సందర్శించారు. అక్కడ దాదాపు ముప్పై ఎకరాల్లో ఉండే వెల్నెస్ రిట్రీట్‌లో మూడు రోజులు గడిపారు. అంతేగాదు అక్కడ జరిగే యోగా సెషన్‌లు, ధ్యానం, ఆయుర్వేద ప్రకృతి వైద్య చికిత్సలన్నింటిలోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కింగ్‌ చార్లెస్‌ అక్కడి వంటకాలకు ఎంతగానో ఫిదా అయ్యారు. అక్కడ ఆయన రెండు కేరళ వంటకాలను అమిత ఇష్టంగా తిన్నట్లు సమాచారం. అవేంటో చూద్దామా..

కింగ్‌ చార్లెస్‌ కేరళ సంప్రదాయ కోడి గుడ్డు కూర, ఇడియప్పం ఎంతో ఇష్టంగా తిన్నారు. అవే కూరలు మరుసటి రోజు కూడా వడ్డించమని కోరారట. కింగ్ చార్లెస్‌ మనుసును దోచుకున్న రెండు రెసీపీల తయారీ విధానం, వాటి చరిత్ర గురించి సవివరంగా చూద్దామా..!.

సాంప్రదాయ కేరళ గుడ్డు కూర..
ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే ఈ కూరని కేరళ పాకశాస్త్ర నిపుణులు చాలా ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, కొద్దిపాటి మసాల దినుసుల వేసి.. విలక్షణమైన రుచితో అందిస్తారు. 

ఇడియప్పం..
ఇక ఇడియప్పం క్రీస్తూ శకం ఒకటొవ శతాబ్ద కాలం నుంచి గొప్ప చరిత్ర కలిగిన వంటకం. బియ్యం పిండిని న్యూడిల్స్‌ మాదిరిగా సతాంగై అనే ప్రత్యేక పరికరంలో ప్రెస్‌ చేసి ఆవిరిపై ఉడికిస్తారు. ఈ వంటకం సరిహద్దులు దాటి శ్రీలంక, మలేషియా, సింగపూర్‌ వంటకాల్లోకి కూడా ప్రవేశించడం విశేషం. అంతలా ఈ వంటకం ఎందరో ఆహరప్రియుల మనసులను గెలుచుకుంది. 

కాగా, కింగ్‌ చార్లెస్‌ దంపతులు అక్కడ క్యూరేటెడ్‌ వెల్‌నెస్‌ డైట్‌ని అనుసరించారు. గతంలో 2019లో ఇదే వెల్‌నెస్‌ రిట్రీట్‌లో కింగ్‌ చార్లెస్‌ 71 పుట్టిన రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచే రాజ దంపతులు ఇక్కడ వంటకాలపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. 

(చదవండి: ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..)
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)