Breaking News

ప్రపంచంలో ఎక్కడా లేదు.. ఆ వీధిలో అడుగుపెడితే 70 భాషలు వినిపిస్తాయ్‌!

Published on Sun, 04/09/2023 - 13:28

ప్రపంచంలోని చాలా నగరాల్లో బహుభాషలు వినిపిస్తుంటాయి. నగర విస్తీర్ణం, ప్రాధాన్యం బట్టి అలా వినిపించే భాషలు పదుల సంఖ్యలో ఉండటమూ మామూలే! చిన్నా చితకా పట్టణాల్లోనైతే సాధారణంగా రెండు మూడు భాషలు; మహా అయితే, అరడజను భాషలు వినిపిస్తాయి. బ్రిటన్‌లోని ఒక చిన్న నగరంలో ఉన్న ఆ వీథి భాషావైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ వీథిలోకి అడుగుపెడితే, ఏకంగా డెబ్బయి భాషలు వినిపిస్తాయి. ఇంతటి భాషా వైవిధ్యమున్న వీథి ప్రపంచంలోని మరే నగరంలోనూ, పట్టణంలోనూ లేదు. ఇంతటి వైవిధ్యభరితమైన వీథి బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌ నగరంలో ఉంది.


ఈ నగర జనాభా 1.32 లక్షలు. ఈ నగరంలోని బార్టన్‌ స్ట్రీట్‌లో రకరకాల ఆర్థిక తరగతులకు చెందిన వారు, నానా దేశాల వారు నివాసం ఉంటుంటారు. ఈ వీథి సందుల్లో పేదలు ఉండే నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ స్థానిక ఇంగ్లిష్‌ ప్రజలతో పాటు తూర్పు యూరోప్‌లోని నానా దేశాల వారు, కరీబియన్‌ దీవుల నుంచి వచ్చినవారు, ఆఫ్రికాలోని పలు దేశాలకు చెందిన వారు, మన భారతీయులు ఉంటుంటారు. ఈ వీథిలో పశ్చిమాసియా నుంచి వలస వచ్చిన ముస్లింలు పెద్దసంఖ్యలోనే కనిపిస్తారు. ఇక్కడి వారు బయట ఇంగ్లిష్‌ మాట్లాడినా, ఇళ్లల్లో తమ తమ మాతృభాషల్లోనే మాట్లాడుకుంటారు. ఈ వీథిలో కనిపించే భాషావైవిధ్యం ఇంకెక్కడా కనిపించదని ఇక్కడి స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు.  

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు