Breaking News

కేన్సర్‌ను జయించా.. సినీనటి సోనాలి బింద్రే

Published on Mon, 10/21/2024 - 08:04

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌ పేషంట్లకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీతార సోనాలి బింద్రే తెలిపారు. స్వయంగా తనకే కేన్సర్‌ ఉందని తెలిసిన సమయంలో ఇక తన జీవితం ముగిసిపోయిందని, ఆవేదనతో కృంగిపోయానని, కానీ తన భర్త అందించిన మానసిక స్థైర్యం, తక్షణ ఆరోగ్య సంరక్షణతో కేన్సర్‌ నుంచి బయటపడ్డానని ఆమె అన్నారు. అక్టోబర్‌.. బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ మంత్‌ నేపథ్యంలో జీవీకే హెల్త్‌హబ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్యానెల్‌ చర్చ నిర్వహించగా, ఇందులో సోనాలితో పాటు ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, జీవీకే హెల్త్‌హబ్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ స్నేహసాగర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే స్క్రీనింగ్‌ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని, దీనికి తానే ఒక నిదర్శనమని అన్నారు. కానీ ఈ ప్రయాణం ఎంతో వేధనతో కూడుకున్నది, ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసేలా చేసిందని చెప్పారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్‌ టెస్టులతో డబ్బులు వృథా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.. చిన్న మొత్తాలకు చూసుకుంటే, ప్రమాదవశాత్తు కేన్సర్‌ భారిన పడితే అంతకు మించిన డబ్బులను కోల్పోవడమే కాకుండా విలువైన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టినవారవుతారని ఆమె సూచించింది.  

వంశపారపర్యంగా 5 నుంచి 10 శాతమే.. 
మహిళల్లో రొమ్ము కేన్సర్‌ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచి్చతంగా కేన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్టులు చేసుకోవాలని పింకీరెడ్డి సూచించారు. ఒక మహిళ దీర్ఘకాలిక రోగాలబారిన పడితే ఆ కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తుగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించగలిగే కొన్ని చిట్కాలను, సంరక్షణ పద్దతులను గురించి మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ స్నేహ సాగర్‌ వివరించారు. రొమ్ము కేన్సర్‌ మహిళలకే కాదు కొంత మంది పురుషులకు కూడా వచ్చే అవకాశముందని ఆమె తెలిపారు.  ప్రముఖ సినీతార నమ్రతా శిరోద్కర్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)