Breaking News

ఎవరీ జోనాస్ మాసెట్టి ..? అలవోకగా వేదాలు, భగవద్గీత..

Published on Thu, 05/29/2025 - 16:09

భారతీయ సంప్రదాయాలకు ఆకర్షతులై ఆ జీవన విధానంతో బతికే విదేశీయలు ఎందరో ఉన్నారు. మన దేశ సంస్కృతి గొప్పతనం ప్రపంచానికి తెలియడానికి ఒక రకంగా ఇలాంటి విదేశీయులు కూడా కారణమని చెప్పొచ్చు. అలానే బ్రెజిల్‌కి చెందిన జోనాస్ మాసెట్టి మన దేశ సంప్రదాయాలకు ఆకర్షితులై వేదాన్ని నేర్చుకోవడమే గాక తన దేశంలో వాటి గురించి ప్రచారం చేసి..సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మన ప్రధాని మోదీ సైతం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మనకీ బాత్‌లో కూడా ఆయన గురించి ప్రస్తావించించారు. ఇంతకీ ఎవరీ జోనాస్‌ అంటే..

బ్రెజిల్‌లోని రియో డిజెనిరియోలో జన్మించిన జోనాస్‌ మాసెట్టి మిలిటరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇంజనీరింగ్ (IME) నుచి మెకానికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రెజిలియన్ ఆర్మీలో ఐదేళ్లు పనిచేశారు. అలాగే కొన్నాళ్లు కన్సల్టింగ్‌ స్టాక్‌  కంపెనీల్లో కూడా పనిచేశాడు. భారతీయ సంప్రదాయాలకు, వేదాలకు ఆకర్షితుడై, చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చాడు. 

కోయంబత్తూర్‌లోని అర్ష వైద్య గురుకులంలో 4 సంవత్సరాల పాటు వేదాలను అభ్యసించాడు. ఆ తర్వాత బ్రెజిల్‌ వెళ్లి అక్కడ  ‘విశ్వ వైద్య’ అనే ఆర్గనైజేషన్‌ను నెలకొల్పి.. వేదాలు వాటి విలువను, సారాంశాన్ని తన దేశ ప్రజలకు బోధిస్తున్నారు. అలాగే  అవి మరింతమంది ప్రజలకు చేరువయ్యేలా ‘వేదాంత.లైఫ్’ అనే వెబ్‌సైట్‌ సాంకేతికతను వాడుకూంటూ.. వేదాల గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. 

అంతేకాదు జోనస్ తన పేరు చివరన ‘విశ్వనాథ్’ను యాడ్ చేసుకోవడం విశేషం. అలాగే మన ప్రధాని మోదీ సైతం ఆయన చేస్తున్న పని అభినందనీయమైనదని కొనియాడారు. అంతేగాదు జోనస్‌ తన 'ఫ్రీ ఓపెన్ కోర్సు' ద్వారా ఏడేళ్లలో సుమారు 1.5 లక్షలకు పైగా విద్యార్థులకు వేద విలువలను బోధించారని మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో చెప్పారు మోదీ. 

అంతేగాదు ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక కృషికి గానూ భారత ప్రభుత్వ పద్మ శ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. మరో విశేషమేమిటంటే వేద గురువు జోనాస్‌ చెప్పుల్లేకుండా తెల్లటి ధోతి, నుదుటన తిలకంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా ఆయన గతేడాది జీ20 శిఖరాగ్ర సమవేశానికి హాజరై అతని బృందంతో సంస్కృతంలో రామాయణాన్ని ప్రదర్శించి అలరించారు కూడా.  

(చదవండి: కెమిస్ట్రీ ప్రొఫెసర్‌నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)