Breaking News

గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అల్లుడు కోడలు ఆయుర్దాయం..!

Published on Mon, 08/12/2024 - 08:51

కోడలు.... ఆమె నాకు పుట్టిన పిల్ల కాదు. ఎక్కడో పుట్టినపిల్ల. ఎక్కడో చదువుకుంది.. ఎవరి ఇంటినుండో వచ్చింది. అయితే నాకు కోడలిగా వచ్చింది. నా కొడుకును సంతోష పెట్టింది.  నా వంశాన్ని పెంచింది. నాకు మనవడిని, మనవరాలిని ఇచ్చింది. నాకు, నా భార్యకు  ఊతకర్ర.. చేతికర్ర అయింది. ముప్పూటలా ప్రేమను పంచిపెడుతున్నది. అటువంటి కోడలును చూసుకుని అత్తామామలు మురిసిపోతారు. అందుకే శాస్త్రం కోడలికి పెద్దపీట వేసింది. మామగారు కాలం చేస్తే... తద్దినం పెట్టేటప్పుడు కొడుకు అక్కడే ఉన్నా దీపం పెట్టే అధికారం మాత్రం కోడలికే ఇచ్చింది. ఏ కారణంచేతనయినా ఆమెకు అవాంతరం ఏదయినా వస్తే... ఆమె మళ్ళీ యోగ్యత పొందినప్పుడే తద్దినం పెట్టాలని చెప్పింది. అంత గొప్ప ఉపకారం చేస్తున్న కోడలిని... మా కిచ్చిన కన్యాదాతకు ప్రతిఫలంగా ఏమిచ్చి గౌరవించగలం!!

నా కూతురిని వేరొకరి ఇంటి కోడలిగా పంపితే.. నేను ఒక మహోపకారం చేసినట్లు. నా కూతురు వేరొకరికి ధర్మపత్ని అయింది. ఆయన తరిస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతానాన్ని పొందాడు. నేను తాతయినట్టుగానే ఆయన తల్లిదండ్రులు తాత, నాయనమ్మలయి వారు సంతోషిస్తున్నారు. భగవంతుడు నాకేమి ఇచ్చాడో వేరొకరికి కూడా ఇచ్చాడు. అది నాకు గొప్ప సంతృప్తి. ఎవరంటారు శాస్త్రం ఆమెకు తక్కువ చేసిందని!!! తండ్రికి ఆమె 21 తరాలు తరించే అవకాశం ఇచ్చింది.

పిల్లను ఇస్తున్నాం... కన్యాదానం చేస్తున్నామంటే... ఏదో పంచలచాపు ఇస్తున్నట్లు కాదు... ఆ పిల్ల మీద అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. పరమ మర్యాద, గౌరవం అల్లుడి దగ్గరే మొదలవుతుంది. మంచి అల్లుడిని పొందడం అంటే మరో కొడుకును కన్నంత ఆనందం. కొడుకు చూపే అభిమానంకన్నా కోడలి అభిమానం పొందిన వారు మరో పదేళ్ళు ఎక్కువగా బతుకుతారు. మా అల్లుడు బంగారం. మా అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడన్న ఆనందం వారి ఆయుర్దాయాన్ని పెంచుతుంది.

కాంచీపురంలో ఒక వృద్ధ వేదపండితుడు తటస్థపడి మాటల సందర్భంలో ఇలా అన్నాడు.. ‘‘అల్లుడు మంచివాడయితే మీకు మరో కొడుకున్నట్టే. మంచివాడు కాకపోతే మీరు నిత్యం చచ్చిపోయినట్లే. కారణం కూతురి బాధను చూడలేక, చూసి.. మింగలేక.. కక్కలేక మీకు ఆ స్థితి ఏర్పడుతుంది.’’ అని.

మనిషిని మనిషి బాధపెట్టుకోవడమయినా, బతికించుకోవడమయినా మన అనుబంధాలనుబట్టి ఉంటుంది. గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుంటే... ఓహ్‌... ఇంత గొప్పగా మాట్లాడి ఇస్తున్నారా పిల్లను... అనిపిస్తుంది. అందుకనే ‘ధర్మేచ అర్థేచ కామేచ....ఏషా నాతి చరితవ్యా... ధర్మప్రజాసంపత్తి అర్థం స్త్రీయం ఉద్వహే’ .. నేను ఈమెను దేనికోసం స్వీకరిస్తున్నాను..ధార్మికమైన సంతానం కోసం... జీవితంలో మొదట భార్య ఊరట, తరువాత కొడుకు ఊరట, తదుపరి కోడలు ఊరట, పిదప మనవడు, మనవరాలు ఊరట...అదీ గృహస్థాశ్రమ వైభవం... తాత పక్కన ఉంటే మనుమలకు ఒక విశ్వవిద్యాలయం పక్కన ఉన్నట్టే.


– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)