Breaking News

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్‌-1 డయాబెటిస్‌ ముప్పు ఎక్కువ

Published on Wed, 07/24/2024 - 16:36

ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్‌. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. 

తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో  10 ఏళ్ల తర్వాత  టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ  అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్‌లైన్‌ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ  తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.

ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్‌ డేటా సాయంతో  పరిశోధకులు  టీఐడీ ఉన్న వ్యక్తుల  235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్‌ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే  ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది.  పదేళ్ల  వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్‌-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్‌ చేయనున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)