Breaking News

ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి

Published on Sat, 02/28/2026 - 06:23

మహిళల ఆరోగ్యంలో ఎముకల క్షీణత (ఆస్టియో పోరోసిస్‌) ఒక ప్రధాన సంక్షోభంగా మారుతోంది. ఒకప్పుడు మెనోపాజ్‌ దాటిన మహిళల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి నేడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ప్రీ–మెనోపాజల్‌ ఆస్టియో పోరోసిస్‌గా పిలిచే ఈ ఎముకల బలహీనత గత దశాబ్దంతో  పోలిస్తే గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

30 ఏళ్లకే...
ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను (బోన్‌ డెన్సిటీ) 25 నుంచి 30 ఏళ్ల మధ్యే సాధిస్తుంది. ఒకసారి 30 ఏళ్లు దాటాక, కొత్త ఎముక ఏర్పడే వేగం కంటే పాత ఎముక అరిగి పోయే వేగం పెరుగుతుంది.

80%
భారతదేశంలో సుమారు 6.1 కోట్ల మంది ఆస్టియో పోరోసిస్‌తో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 80% మంది మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశం.

20–25%
పట్టణ ప్రాంతాల్లో నివసించే 30 ఏళ్ల పైబడిన మహిళల్లో సుమారు 20% నుంచి 25% మందికి ఆస్టియో పీనియా (ఎముకలు పల్చబడటం – ఇది ఆస్టియో  పోరోసిస్‌కు ముందు దశ) ఉన్నట్లు గుర్తించారు.

70–80%
∙భారతదేశంలోని మెట్రో నగరాల్లో 30 ఏళ్ల మహిళల్లో దాదాపు 70% నుంచి 80% మంది విటమిన్‌–డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.

50 ఏళ్లు
∙50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఎముక విరుపునకు గురవుతున్నారు.

15%
∙ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను 30 ఏళ్ల నాటికి చేరుకోవాల్సి ఉన్నా.. సరైన  పోషకాహారం లేక పోవడం వల్ల 15% మంది మహిళలు అసలు గరిష్ట సాంద్రతను చేరుకోవడంలో విఫలమవుతున్నారు, దీనివల్ల వీరికి 45 ఏళ్లకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోంది.

20%
∙మెనోపాజ్‌ ప్రారంభమైన మొదటి 5 నుంచి 7 ఏళ్లలోనే మహిళలు తమ శరీరంలోని మొత్తం ఎముక ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతున్నారు.

2040
∙ప్రస్తు్తతం 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు, తమ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, 2040 నాటికి దేశంలో హిప్‌ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

21.2%
∙ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 21.2% మందికి ఆస్టియో పోరోసిస్‌ ఉంది

ముందు జాగ్రత్తలే ముఖ్యం
∙ప్రతిరోజూ శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, రాగులు వంటివి తీసుకోవాలి ∙రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు సహజమైన ఎండ తగిలేలా చూసుకోవాలి ∙కేవలం నడక సరి పోదు, ఎముకలపై ఒత్తిడి కలిగించే వెయిట్‌–బేరింగ్‌ వ్యాయామాలు, యోగా ఉండేట్లు చూసుకోవాలి ∙50 ఏళ్లు దాటిన మహిళలు, ప్రమాద సూచనలు ఉన్నవారు తప్పనిసరిగా బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ చేయించుకోవాలి.

ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం కేవలం వృద్ధాప్యంలోనే కాదు, యవ్వనం నుంచే ప్రారంభమవడం ఎంతో ముఖ్యం. అందుకోసం తగిన  పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)