Breaking News

గ్లామరస్‌ క్వీన్‌ దీపిక బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!

Published on Thu, 04/04/2024 - 17:36

బాలీవుడ్‌ గ్లామరస్‌ క్వీన్‌ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్‌ పాలోయింగ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్‌ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్‌ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్‌ లుక్‌తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్‌ని ఎలా మెయింటెయిన్‌ చేస్తున్నారు? ఆ సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాలని  కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..!

దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. 

తప్పనిసరిగా మేకప్‌ని తొలగించే..
నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్‌ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ వంటివి ఉండవని చెబుతోంది. 

సన్‌స్క్రీన్‌ తప్పనిసరి..
బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్‌ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్‌స్క్రీన్‌ రాసుకుంటానని చెబుతోంది.  

క్లోడ్‌ వాటర్‌ థెరపీ
అలాగే ముఖానికి క్లోడ్‌ వాటర్‌ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది. 

హైడ్రేటెడ్‌గా ఉంచడం..
తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్‌  తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్‌కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది. 

కొబ్బరి నూనె..
శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్‌ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్‌ మెయింటెయిన్‌ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది. 

జీవనశైలి
గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు. 

(చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడాలంటే గంజితో ఇలా చేయండి!)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)