Breaking News

క్రేజ్‌ ఫుల్‌.. బోబా బబుల్‌ టీ..! స్పెషాల్టీ ఇదే..

Published on Mon, 06/02/2025 - 09:42

ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్న తాజా డ్రింక్‌ సంచలనం.. బోబా టీ, లేదా బబుల్‌ టీ. తైవాన్‌లో పుట్టిన ఈ పానీయం ఇప్పుడు భాగ్యనగరంలోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇటీవల బోబా టీ షాప్స్‌ ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్‌ వంటి నగరంలోనూ పెరుగుతున్నాయి. కాలేజీ యువత, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ దీనిని చల్లదనాన్నిచ్చే ఆహ్లాదకరమైన డ్రింక్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.  

బోబా టీ అనేది టీ ఆధారిత పానీయం. అదే దీనికి ప్రత్యేకతను చేకూర్చే అంశం. టాపియోకా పెరల్స్‌ లేదా బోబా బాల్స్‌. ఇవి చిన్న గోళాకార బంతుల్లా ఉంటాయి.  తీపిగా, కొద్దిగా చిక్కదనం ఉండే ఈ బంతులు టీతో కలిసినపుడు ఒక వినూత్న రుచిని జత చేస్తాయి. బోబా టీ కూడా బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లేదా మిల్క్‌ టీ తరహాలోనూ వినియోగించవచ్చు. లేదా దీనికి పండ్ల ఫ్లేవర్స్, సిరప్‌లు, పాలు లేదా క్రీమ్‌లను కూడా కలుపుతారు. బోబా టీలో భాగంగా టాపియోకా బాల్స్‌ కాకుండా జెల్లీ, ఫ్రూట్‌ బిట్స్‌ వంటి వేరే రకాల టాపింగ్స్‌ కూడా వినియోగిస్తారు.  

ఎన్నెన్నో.. వెరై‘టీ’లు 
బోబా టీ వివిధ రుచుల్లో మ్యాంగో, స్ట్రాబెర్రీ, చెరకు, కొబ్బరి వంటి అనేక ఫ్లేవర్లలో లభ్యమవుతోంది. ప్రత్యేకమైన టేక్‌–అవే గ్లాస్‌లు, స్టైలిష్‌ స్ట్రా, బాల్స్‌ వల్ల యువత ఈ పానీయం పట్ల అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆకట్టుకునే కలర్‌ కాంబినేషన్‌లు, ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్‌ వల్ల బోబా టీ ఇన్‌స్టా, ఇతర సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ల ద్వారా బాగా పాపులర్‌ అయిపోయింది. 

పోషక విలువలు.. 
కాసావా స్టార్చ్‌ లేదా సముద్రపు పాచి సారం నుండి తయారు చేసిన ఈ ముత్యాలు సహజంగా గ్లూటెన్‌ రహితమైనవి. పైగా పూర్తి శాకాహారం. కాసావా అనేది విటమిన్‌ ‘సి’ మంచి మూలం. ఇది వాపును తగ్గించే, కొల్లాజెన్‌ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే యాంటీఆక్సిడెంట్‌. దీంతోపాటు ఫైబర్, విటమిన్‌ బి6 పుష్కలంగా లభిస్తుంది. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్యం సంగతేం ‘టీ’.. 
బోబా టీ కాస్త అధికంగా తీపి పదార్థాలతో కూడినందున దీనిని అప్రమత్తంగా వినియోగించాలి. ఎందుకంటే దీనిలో అధిక క్యాలరీలు ఉంటాయి. అయితే కొంతమంది టాపియోకా బాల్స్‌ను, చక్కెరను తగ్గించి ఆరోగ్యకరమైన రీతిలో కూడా తయారు చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా, నగరంలోనూ ఉన్న ప్రముఖ కేఫ్‌ చైన్‌ యమ్మీ బీ, బోబా టీకి కొత్త వెర్షన్‌ను తాజాగా మార్కెట్లోకి తెచ్చింది. ఆరోగ్యాభిలాషులను దృష్టిలో పెట్టుకుని షుగర్‌–ఫ్రీ బోబా టీని ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది. మ్యాంగో బోబా టీ, థాయ్‌ బోబా టీ, మాచా బోబా టీ.. వంటి పేర్లతో ఈ బోబా/బబుల్‌ టీ నగర ఆహార ప్రియుల అభి‘రుచుల్లో’ ఒకటిగా మారింది.   

(చదవండి: ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేయండిలా..)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)