Breaking News

నడుము చుట్టూ నలుపా? అబ్బాయిలూ ఈ చిట్కాలు మీకు కూడా!

Published on Tue, 06/10/2025 - 14:56

బాగా బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శారీరంగా అసౌకర్యంతో పాటు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. టైట్‌ జీన్స్‌ వల్ల మహిళలు, పురుషుల్లో  సమస్యలు తప్పవు. అలాగే  టైట్‌గా ఉండే బ్రాలు,  ప్యాంటీలువల్ల  ఆయా ప్రదేశాల్లో ర్యాషెస్‌ రావడంతోపాటు నల్లని మచ్చలు ఏర్పడతాయి.  చర్మ వ్యాధులకు దారి తీస్తాయి.  మరి ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?  ఎలాంటి చిట్కాలు పాటించాలి?

పురుషుల్లో నడుము చుట్టూ  బెల్టు పెట్టుకునే చోట లేదా మహిళల్లోనైతే వారు లోపలి లంగా లేదా సెల్వార్‌ నాడా కట్టుకునే చోట నల్లగా మచ్చపడే అవకాశం ఉంది. అందుకే మరీ గట్టిగా లాగిగానీ  లేదా మరింతగా బిగించిగానీ కట్టకపోవడం మంచిది. ఇక్కడ మరీ బిగుతుగా కాకుండా మరీ వదులుగా కాకుండా తగినంత సౌకర్యంగా ఉండేలా బెల్ట్‌/నాడా కట్టుకోవడం మంచిది. 

నలుపు  పోవడానికి చిన్న చిట్కాలు... 
∙మనం చేసే పని (వృత్తి)లో భాగంగా మరీ ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి ఉండటమూ / కూర్చొని ఉండటం సరికాదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 5-10 నిమిషాల΄ పాటైనా అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. దీనివల్ల అన్ని భాగాల్లో లాగే నడుము ప్రాంతంలో కూడా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. దీనివల్ల నలుపు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. 

క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ ఫైబర్‌ వల్ల శరీరానికి మంచి బిగువు వస్తుంది. ఇలా బిగువుగా ఉండే వారిలో చర్మం మంచి మిలమిలలతో ఆరోగ్యంగా ఉంటుంది. 

ఇటు మహిళలైనా, అటు పురుషులైనా పడుకునే సమయంలో కాళ్ల కింద తలగడ పెట్టుకుని, అవి పడక నుంచి 10  అంగుళాల పైన ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నడుము చుట్టూ ఉన్న నల్ల మరకల నివారణకు తోడ్పడటమే కాకుండా, గుండెకూ తగినంత రక్తప్రసరణ సులువుగా అవుతుంటుంది. బిగుతైన దుస్తులను ధరించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను, చర్మవ్యాధులను తగ్గించడం చాలా సులభం. కేవలం వాటికి బదులు మంచి గాలి ఆడేందుకు వీలుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. 

అయితే ఇలాంటి టైట్‌ ఫిటింగ్‌ ఫ్యాషన్‌ను వదులుకోడానికి ఇష్టపడని యువత ఒక జాగ్రత్తను పాటించడం మంచిది. అదేమిటంటే... మరీ ఎక్కువ బిగుతైన దుస్తులకు బదులుగా ఒంటికి నప్పేలా ఉండటంతో పాటు, హానికరం కానంత మేరకు మాత్రమే.

నివారణ...
బిగుతైన దుస్తులను ధరించడం మంచిది. ఇక అండర్‌గార్మెంట్స్, సాక్స్‌ విషయానికి వస్తే... చర్మానికి అంటుకుపోయేంత బిగువుగా కాకుండా, కాస్తంత గాలి ఆడేందుకు వీలుగా ఉండేవి వాడటం మేలు. ఇక్కడ నైలాన్‌ వంటి వాటికి బదులుగా కాటన్‌వి ఎంపిక చేసుకోవడం చాలావరకు మేలు చేసే అంశం.   

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)