"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్‌లో టాపర్‌గా..!
Published on Thu, 04/16/2026 - 16:03
మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్‌డాగ్ మిలియనీర్‌గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్ అంటే..
బోఫాల్‌లోని భీమ్ నగర్ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్ బోర్డు ఎగ్జామ్2026లో కామర్స్ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి.
చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్‌లో విద్యార్థులంతా వివిధ కోచింగ్ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది.
ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్‌లో 98.8% మార్కులతో టాపర్‌గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.
(చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్‌గా..!)
Tags : 1