Breaking News

వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది

Published on Sun, 08/24/2025 - 12:27

భారతీ సింగ్‌.. హాస్యప్రియులకు సుపరిచితమైన పేరు! దేశంలోని తొలి తరం మహిళా స్టాండప్‌ కమేడియన్లలో ఒకరు.. ద గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ చాలెంజ్‌ ఫేమ్, రియాలిటీ షోస్‌ పార్టిసిపెంట్‌ అండ్‌ హోస్ట్‌.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తన పేరుకు ముందు ఇన్ని విశేషణాలున్న భారతీ సింగ్‌ వాళ్లింట్లో అన్‌వాంటెడ్‌ చైల్డ్‌ అట. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. అన్న, అక్క తర్వాత ఆమె. 

మనసులో మాట విన్నట్టుగా దేవుడు ఒక కొడుకు, కూతురుని ఇచ్చాడు.. ఇంక సంతానం చాలు అనుకుందట భారతీ వాళ్లమ్మ. కానీ మూడోసారీ గర్భం దాల్చింది. మూడో నెల వచ్చేదాకా ఆమెకు తెలీలేదు. తెలియగానే గాభరా పడిందట. ఎందుకంటే భారతీ సింగ్‌ తండ్రి ఓ ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. ముగ్గురు పిల్లలను పెంచేంత ఆర్థిక స్థోమత లేదని ఇద్దరు పిల్లలే చాలనుకుంది భారతీ సింగ్‌ వాళ్లమ్మ. 

అందుకే మూడో బిడ్డ కడుపులో పడిందని తెలియగానే గర్భస్రావం కోసం చెట్ల మందుల నుంచి, బొప్పాయి, ఖర్జూర పళ్లను తెగ తిన్నదట. బరువైన పనులు చేస్తే గర్భస్రావం అవుతుందని ఉదయం నుంచి రాత్రి దాకా వంచిన నడుము ఎత్తకుండా పనిచేసిందట. అయినా గట్టి పిండం.. భూమ్మీద పడింది. ఆసుపత్రికి వెళితే ఖర్చని.. ఇంట్లోనే కన్నదట. బొడ్డుతాడు కత్తిరించడానికి మంత్రసానిని మాత్రం పిలిపించిందట. 

అందుకు ఆ మంత్రసాని అరవైరూపాయలు తీసుకుందట అంతే! అందుకే భారతీ సింగ్‌ అంటుంది ‘కేవలం అరవై రూపాయల ఖర్చుతో నేను పుట్టాను’ అని... రానీయకుండా చేద్దామనుకుంది కానీ.. పుట్టాక నన్నే ఎక్కువ గారంగా చూసింది. నా రెండో ఏటనే నాన్న చనిపోయాడు. అయినా మా ముగ్గురికీ ఏ లోటూ తెలియనివ్వలేదు. తల్లీతండ్రీ తానై కష్టపడి పెంచింది. అందుకే అమ్మంటే నాకు చాలా ఇష్టం’ అని చెబుతుంది భారతీ సింగ్‌. 

ప్రముఖ పాడ్‌కాస్టర్‌ రాజ్‌ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకుంది అమృత్‌సర్‌ వాసి భారతీ. ‘మూడో సంతానం వద్దనుకున్న అమ్మ .. అబార్షన్‌తో నన్ను భూమ్మీదకు రాకుండా చేద్దామనుకుంది. నా జోకులతో జనాలను చావగొట్టే రాత రాసుంది కాబట్టి.. వచ్చాను. వద్దనుకున్న బిడ్డకు ఆసుపత్రి ప్రసవం ఎందుకని కేవలం 60 రూపాయల ఖర్చుతో నాకు జన్మనిచ్చింది. కానీ నేను అమ్మకు ఇప్పుడు కోటీ అరవై లక్షల రూపాయల ఖరీదు చేసే ఇల్లును గిఫ్ట్‌గా ఇచ్చాను.. నన్ను కన్నందుకు కృతజ్ఞత గా... అని సగర్వంగా చెబుతుంది.  

(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌..!)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)