Breaking News

రావయ్యా...  కన్నయ్యా

Published on Fri, 11/20/2026 - 01:04

గ్రామి అవార్డ్స్‌లో దక్షిణ భారతీయ గీతాలు నామినేషన్‌ పొందడం ఇప్పటి వరకూ లేదు. సుభిక్ష రంగరాజన్‌ పాడిన తమిళ కృష్ణగీతం‘వరువాయ్‌’ మొదటిసారి గ్రామి నామినేషన్‌ పొంది ఆ ఘనత సాధించింది. వందేళ్ల క్రితం భారతీయార్‌ రాసిన ఈ గీతం జాజ్‌ ఫ్యూజన్‌తో ప్రపంచాన్ని ఆకర్షించడమే కారణం. ఈ పాటతో జగతిని కృష్ణమయం చేసిన సుభిక్ష గాన ప్రయాణం ఇది.

ప్రపంచ సంగీత రంగానికి ఆస్కార్‌ లాంటి ‘గ్రామీ అవార్డ్స్‌ 2027’లో వందేళ్ల నాటి తమిళ పాట తలెత్తుకుని నిలబడింది. కృష్ణప్రేమను చాటే ‘వరువాయ్‌’ పాట తన మార్దవంతో ప్రపంచాన్ని తాకింది. అందుకే  వేలాది గీతాలు, వందలాది దేశాల మధ్య పోటీకి నిలిచి, 526 ఎంట్రీలను దాటి, ‘బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ పెర్ఫార్మెన్స్‌’లో నామినేషన్‌ పొందింది. షకీరా, ఫారెల్‌ విలియమ్స్‌ లాంటి దిగ్గజాల సరసన నిలబడి పోటీ ఇస్తున్న సుభిక్ష రంగరాజన్  ఫైనల్స్‌ వైపు దేశం మొత్తం తల తిప్పేలా చేయగలిగింది. సుభిక్ష రంగరాజన్‌ను ‘సుషా’ అని కూడా పిలుస్తారు.

వందేళ్ల నాటి పిలుపు
‘వరువాయ్‌ వరువాయ్‌ వరువాయ్‌ కణ్ణా...’ అంటే ‘రావయ్యా... నా ముందుకు రావయ్యా కన్నయ్యా’ అని అర్థం. మహాకవి సుబ్రహ్మణ్య భారతి (భారతీయార్‌) వందేళ్ల క్రితం రాసిన ఈ కృష్ణ భక్తి కీర్తనలో కన్నయ్య రాక కోసం ఒక భక్తురాలు పడే తపన, ఆర్తి ఉంటాయి. సంప్రదాయ కర్ణాటక కచేరీలలో భక్తిభావంతో పాడుకునే ఈ గీతాన్నే సుషా సంగీతదర్శకుడు దేవన్‌ ఏకాంబరం నిర్దేశంలో పాడి చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం పాట కాదు... మా ఇంట్లోని మూడు తరాల మహిళల ఆధ్యాత్మిక అనుబంధం’ అంటారు సుభిక్ష భావోద్వేగంగా.

కర్ణాటకం... జాజ్‌
కర్నాటక సంగీత తరహాలో పాడుకునే ఈ పాటలో కొన్ని మార్పులు జరిగాయి. దేవన్  ఏకాంబరం దీనిని సంప్రదాయ సిద్ధంగా ట్యూన్‌ చేయబోతే సుషా చొరవ చేసి ‘దేశ్‌’ రాగం సూచించారు. అంతేకాదు జాజ్‌ కలిపితే బాగుంటుందన్నారు. ‘కర్ణాటక సంగీతం, పాశ్చాత్య జాజ్‌ రెండూ ఇం్రపొవైజేషన్  ఆధారంగా నడిచే జంట రూపాలు. అందుకే ఈ పాటకు  నియో–జాజ్‌ స్టయిల్‌ సజెస్ట్‌ చేశాను’ అంటుంది సుషా. ప్రయోగం ఫలించింది. 

‘వరువాయ్‌’ ఒక కొత్త శబ్ద ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఇంతకీ దేవన్‌ ఎవరంటే.. ‘ప్రేమికుల రోజు’లోని ‘ఓ మరియా’ పాటను పాడిన గాయకుడు అతనే. దక్షిణాది భాషల్లో 500కు పైగా సినీ గీతాలు ఆలపించినా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ‘నాలోని కంపోజర్‌కు గుర్తింపు రావడానికి 30 ఏళ్లు పట్టింది.. ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా’ అంటూ గ్రామీ నామినేషన్  ప్రకటన రాగానే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు దేవన్ .

కచేరీల ఇంటి నుంచి
సుషా చెన్నైవాసి. వీరిది సంగీత కుటుంబం. ప్రఖ్యాత సెమ్మంగుడి కర్ణాటక సంగీత పరంపర వీరి ఇంటిలో ఉంది. తల్లి లక్ష్మీ రంగరాజన్  తొలి గురువు. పదమూడేళ్ల వయసులోనే కచేరీలు మొదలుపెట్టిన సుషా ఆల్‌ ఇండియా రేడియో ఎ–గ్రేడ్‌ ఆర్టిస్ట్‌. 

కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో జాజ్‌ మ్యూజిక్‌లో మాస్టర్స్‌ పట్టా పొందారు. ఇళయరాజా, ఏ.ఆర్‌. రెహమాన్  లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు. గాయనిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా, పెయింటర్‌గా, యానిమేటర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు. ఇటీవలే ప్రపంచ దేశాల కళాకారులతో కలిసి ‘లవ్‌ లాంగ్వేజ్‌’ అనే ఆల్బమ్‌ కూడా తెచ్చారు.

గ్రామీ పీఠం దక్కేనా?
ఫిబ్రవరి 7, 2027న లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న 69వ గ్రామీ వేడుకలపై ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి.  భారతీయ శాస్త్రీయ మూలాలకు ఆధునిక జాజ్‌ సొబగులు అద్దిన ‘వరువాయ్‌’ పాట గ్రామీ జ్యూరీని ఆకర్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవార్డు సంగతి ఎలా ఉన్నా.. తెలుగు, తమిళ గడ్డపై పుట్టిన కర్ణాటక రాగం గ్రామీ నామినేషన్  దక్కించుకోవడమే ఒక చరిత్ర! 

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)