Breaking News

గ్లోయింగ్‌ స్కిన్‌ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్‌ జ్యూస్‌ ట్రై చేయండి!

Published on Wed, 07/03/2024 - 11:57

బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనే ప్యార్‌ కియా వంటి మూవీలో మంచి హిట్‌లను అందుకుని తన నటనతో వేలకొద్ది అభిమానులకు చేరువయ్యింది. వివాహ బంధంతో సినిమాలకు దూరంగా ఉన్నా..అంతే గ్లామర్‌ మెయింటైన్‌ చేస్తున్న నటి భాగ్యశ్రీ. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో సరికొత్త వంటకాలను షేర్‌ చేసుకుంటుంటారు. ప్రస్తుతం తాజగా కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్‌తో మన ముందుకు వచ్చింది భాగ్యశ్రీ. బచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేసిన గ్రీన్‌ జ్యూస్‌ గురించి చెప్పుకొచ్చారు. ఇది చర్మం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కాంతివంతంగా ఉంచుతుందని చెప్పారు. 

గ్రీన్‌ జ్యూస్‌తో కలిగే లాభాలు..
ఉదయమే ఒక గ్లాస్లు ఈ గ్రీన్‌ జ్యూస్‌ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన గట్‌ బ్యాక్టీరియాని ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పైగా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీనిలో విటమిన్‌ ఏ అధికంగా ఉంటుంది. 

కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట​ గుణాలు ఉంటాయి. ఇవి గట్‌ ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది. 

తయారీ..
నటి భాగ్యశ్రీ బచ్చలికూర, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయ తదితరాలను మిక్క్‌లో వేసి మెత​్తగా జ్యూస్‌ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత చక్కగా వడకట్టుకుంటే చాలు గ్రీన్‌ జ్యూస్‌ రెడీ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి పోషకాలు అందడమేగాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

(చదవండి:  'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్‌'!..ఏకంగా రోబోటిక్‌ పాములతో..)
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)