నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!

Published on Wed, 09/11/2024 - 10:47

ఏమాత్రం కదల్చడానికి వీలులేనంత తీవ్రంగా భుజం నొప్పి రావడం ఇంటి పనులు, కంప్యూటర్ల ముందు çకూర్చుని పనిచేసేవారికి తెలిసిందే. కారణాలు ఎన్ని ఉన్నా భుజాల నొప్పులు ఇటీవల చాలా సాధారణమయ్యాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికీ ఉండచ్చు. నొప్పిని భరిస్తూ అలాగే ఉండిపోతే భుజాల కదలికలు తగ్గుతాయి. సమయానికి చికిత్స చేయక΄ోతే సమస్య దీర్ఘకాలికంగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ పది నిమిషాలు చేయదగిన వ్యాయామాలను నటి భాగ్యశ్రీ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

వ్యాయామ బ్యాండ్‌

  • రెండు చేతులతో వ్యాయామ బ్యాండ్‌ రెండు చివర్లను పట్టుకోవాలి.

  • బ్యాండ్‌ సాయంతో వ్యాయామం చేయడానికి చేతులను ముందుకు చాచాలి. 

  • తిరిగి యధాస్థానానికి తీసుకురావాలి. 

  • ఇలాంటప్పుడు మోచేతులు తుంటిపక్కన నిటారుగా ఉండేలా చూసుకోవాలి. 

  • ఈ వ్యాయామాన్ని 8 సార్లు చేయాలి.

ఫ్రెంచ్‌ ప్రెస్‌

  • చేతులను ఎంత వీలైతే అంత వెనకకు కదల్చాలి

  • తర్వాత ఒక చేతిని ముందు వైపుకు తీసుకోవాలి. 

  • తిరిగి ప్రారంభ స్థానానికి 3 దశలుగా రావాలి.

  • ఈ వ్యాయామం 10–15 సార్లు చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు విరామం తీసుకోవాలి.

ఓవర్‌ హెడ్‌

  • నిటారుగా నిలబడి,. చేతులను తుంటి భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి.  ∙వీలైనంత వరకు చేతులను తలమీదుగా పైకి ఎత్తాలి. 

  • వెన్నెముక వంపు రాకుండా నిటారుగా ఉంచాలి. 

  • తిరిగి మెల్లగా యధాస్థానంలోకి రావాలి. ఈ విధంగా 10–12 సార్లు చేయాలి. 

  • ఈ వ్యాయామాల గురించి డాక్టర్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘ఫ్రోజెన్‌ షోల్డర్‌ కోసం చేసే వ్యాయామాల కదిలికల పరిధిని పెంచడానికి వీటిని రూపొందించారు. ఫ్రెంచ్‌ ప్రెస్, బ్యాండ్‌ ఫుల్‌ రెండూ వేరు వేరు పద్ధతుల్లో ఉండటం వల్ల భుజాలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది’ అని  తెలియజేశారు. దీంతోపాటు మరో  రెండు వ్యాయామాల గురించి వివరించారు.

లోలకం మాదిరి.. 

  • గడియారంలోని లోలకం కదలికలు ఉన్నట్టు ఈ వ్యాయామం ఉంటుంది. 

  • ఫ్రోజెన్‌ షోల్డర్‌ చేయి కిందికి వేలాడదీయడానికి వీలుగా కొద్దిగా వంగాలి. 

  • ఒక అడుగు వ్యాసంతో చేతిని చిన్న వృత్తంలా తిప్పాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు.

టవల్‌తో సాగదీయడం..

  • రెండు చేతులతో వీపు వెనక నుంచి ఒక టవల్‌ను సమాంతరంగా పట్టుకోవాలి. 

  • నొప్పి ఉన్న భుజం వైపుకు టవల్‌ను లాగడానికి మరో చేతిని ఉపయోగించాలి.

లోపలి వైపుకు... 

  • మూసి ఉన్న తలుపు పక్కన నిలబడి, డోర్‌ నాబ్‌ చుట్టూ వ్యాయామ బ్యాండ్‌ ఒక చివర కట్టాలి. 

  • మోచేతిని 90 డిగ్రీల కోణంలో ఉంచి, నొప్పి ఉన్న చేతితో వ్యాయామ బ్యాండ్‌ మరొక చివరన పట్టుకోవాలి.   బ్యాండ్‌ని మీ శరీరం వైపు రెండు లేదా మూడు అంగుళాలు లాగి కొన్ని సెకన్లపాటు పట్టుకోవాలి.

  • ఇలా 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి. 

(చదవండి: నటుడు కమలహాసన్‌ సరికొత్త బ్రాండ్‌​! జీరో వేస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌!)
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు