Breaking News

బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా ది బెస్ట్‌ ఫార్ములా!

Published on Wed, 03/05/2025 - 16:44

బరువు తగ్గాలంటే  జీవన శైలి మార్పులు చేసుకోవాలి.  వాకింగ్‌, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు  ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్నా కూడా  వాకింగ్‌కు మించింది లేదు. ఈ వాకింగ్‌లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు.  అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్‌ బోర్‌ కొట్టకుండా  ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.

ఫిట్‌గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  నడక వల్ల  బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి.  కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్‌ లాంటి  వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే  2:2:1 వాకింగ్‌ ఫార్ములా

చదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!

ఏంటీ  2:2:1  వాకింగ్‌ ఫార్ములా 
రెండు(2)  నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking)  
తరువాతి రెండు(2) నిమిషాలు  జాగింగ్‌ (jogging) చేయడం
ఆ తరువాత ఒక నిమిషం (1) పాటు  సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్‌ను రిపీట్‌ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.  రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం  ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్‌గా భావిస్తారు.  

ప్రయోజనాలు

  • కేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్‌ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి

  • జీవక్రియ వేగవంతమవుతుంది.

  • వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది.  

  • ఆ తరువాత చేసే జాగింగ్‌  కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. 

  • బ్రిస్క్‌ వాకింగ్‌, జాగింగ్‌ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది.  

  • నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్‌తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. 

నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా  వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే  2:2:1 ఫార్ములా  ఉత్తమమంటున్నారు నిపుణులు. 


 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)