Breaking News

ఇంటినే సాగరతీరంలా మార్చేద్దాం ఇలా..!

Published on Sun, 05/11/2025 - 16:39

వేసవిలో పిల్లలతో కలిసి టూర్లకు విరివిగా వెళుతుంటారు. వేసవిని ఆహ్లాదకరంగా గడపడానికి చాలామంది సముద్రతీరాలను ఎంచుకోవడం మామూలే! ఈ వేసవిలో బీచ్‌ల అనుభూతిని పొందాలంటే అలాంటి వాతావరణాన్ని  ఇంట్లోనే సృష్టించుకోవచ్చు. ఆహ్లాదాన్నే కాదు వినూత్నమైన ఈ అలంకరణతో అతిథుల మనసునూ ఆకట్టుకోవచ్చు.

సముద్ర జీవరాశిని పోలిన కుషన్స్‌
నత్తలు, గవ్వలు, తాబేలు, చేపలు తదితర జలచరాలను పోలి ఉండే కుషన్‌ మోడల్స్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. లేదంటే కొనుగోలు చేయవచ్చు. ఈ కుషన్స్‌ డిజైన్స్‌ బట్టి వందల రూపాయల నుంచి ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో లభిస్తున్నాయి. 

బీచ్‌ స్టైల్‌ ఫర్నిషింగ్‌
బీచ్‌ వాతావరణం ఉండే కర్టెన్స్, సోఫా కవర్స్, బెడ్‌షీట్స్‌ వంటివి అలంకరణకు ఉపయోగించవచ్చు. వీటిలో పేస్టల్‌ కలర్స్‌ ఎంపిక వేసవికి సరైన ఎంపిక అవుతుంది. కర్టెన్‌ హుక్స్, హ్యాంగర్స్‌ స్టార్‌ ఫిష్, షెల్స్‌ను పోలిన డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. 

గవ్వల డిన్నర్‌ సెట్స్‌
గవ్వలతో డిజైన్‌ చేసిన టేబుల్‌ మ్యాట్స్, తెల్లని పింగాణీ ప్లేట్ల అమరిక, ల్యాంప్‌ హోల్డర్లు, స్పూన్, టిష్యూ హోల్డర్లు మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. సెంటర్‌ టేబుల్స్, అక్వేరియమ్, శంఖాలు, గవ్వలతో డిజైన్‌ చేసిన ఫౌంటైన్లు అదనపు అకర్షణను ఇస్తాయి. బీచ్‌లకు వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను చాలా మంది సేకరిస్తుంటారు. అలాంటి వాటిని ఈ సమ్మర్‌లో ఇంటి అలంకరణలో వాడచ్చు.  

(చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!)

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)