Breaking News

ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌.. ఇండిగో స్థానం ఇది!

Published on Wed, 12/04/2024 - 16:39

విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్‌ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. 

ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్‌ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్‌, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్‌లకు ర్యాంకుల ఇచ్చింది.

ఇందులో జనవరి నుంచి అక్టోబర్‌ వరకు గల డేటాను బేస్‌ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్‌ హెల్ప్‌ సీఈవో టామ్జ్‌ పౌల్జిన్‌ చెబుతున్నారు.

2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..

100. స్కై ఎక్స్‌ప్రెస్

101.ఎయిర్ మారిషస్

102. తారోమ్

103. ఇండిగో

104. పెగాసస్ ఎయిర్‌లైన్స్

105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్

106. బల్గేరియా ఎయిర్

107. నౌవెలైర్

108. బజ్

109. తునిసైర్

2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..

10. ఎయిర్ సెర్బియా

9. వైడెరో

8. ఎయిర్ అరేబియా

7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్

6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్

5. ప్లే (ఐస్లాండ్)

4. అమెరికన్ ఎయిర్‌లైన్స్

3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్

2. ఖతార్ ఎయిర్‌వేస్

1. బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్

ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్‌వేస్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. 

ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.

ఇండిగో స్పందన:

భారత్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హెల్ప్‌ ఇచ్చిన ర్యాంక్‌ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్‌ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్‌ రెగ్యులేటర్‌, డైరెక్టరేట్‌ జనరల్‌​ ఆఫ్‌ సివిల్‌​ ఏవియేషన్‌(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా  ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. 

అంతేగాక నెలవారీగా కస్టమర్‌ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హెల్ప్‌ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది.

 

(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక)

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)