Breaking News

బాల స్టార్టప్‌... బ్రహ్మాండం!

Published on Thu, 11/06/2025 - 11:02

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు ఏజ్‌తో పనేమిటి! బెంగళూరుకు చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు ‘ఎకోవాలా’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి జిగురు, కత్తెర ఉపయోగించకుండా పర్యావరణహితమైన కాగితపు సంచులను తయారు చేస్తున్నారు. నెలకు రూ.10 రూపాయల సబ్‌స్క్రిప్షన్‌తో కస్టమర్‌లకు ప్రతి ఆదివారం ‘ఎకోవాలా’ నుంచి రెండు చేతిసంచులు అందుతాయి.

‘చిన్న వయసులో మంచి ఆలోచన చేశారు అని చాలామంది ప్రశంసిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారు అదనపు బ్యాగ్‌లు అడగవచ్చు. వీటి గురించి తెలియని వారికి ఫ్రీ శాంపిల్‌ బ్యాగులు ఇస్తాం. ఇప్పటికంటే సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది’ అంటుంది ఫౌండర్‌లలో ఒక బాలిక.

‘ఇవి మేము తయారు చేసిన బ్యాగ్‌లు’ అంటూ ఉత్సాహంగా ఫొటోలకు పోజ్‌ ఇచ్చారు’ ఎకోవాలా యజమానులు. వీరి స్ఫూర్తిదాయకమైన ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ‘ఎకోవాలా’ స్టార్టప్‌ గురించి ప్రశంస పూర్వక కామెంట్‌ రాశారు. ఎంతోమంది నెటిజనులు ‘ఎకోవాలా’ ఫౌండర్స్‌ను ప్రశంసించారు.

‘ఇది కేవలం స్టార్టప్‌ కాదు. నెలకు రూ.10కి మన ఇంటికి చేరువయ్యే పర్యావరణ బాధ్యతలలో ఒక పాఠం’ అని ఒకరు రాశారు. ‘ఈరోజుల్లో చాలామంది పిల్లలు ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు అతుక్కుపోయి బుర్రకు పనిచెప్పడం లేదు. అలాంటి వారికి ఎకోవాలా ఫౌండర్స్‌ ఆదర్శంగా నిలుస్తారు’ అని మరో యూజర్‌ స్పందించారు. 

 

 

(చదవండి: Pari Bishnoi Success Story: ఐఏఎస్‌ అయ్యాను ఇలా..! అదే నా గెలుపు మంత్ర..)

#

Tags : 1

Videos

విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు

జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

Asifabad District: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

దేశవ్యాప్తంగా 1,800 విమానాలు రద్దు

నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

Photos

+5

Kamal Haasan: బార్బర్‌ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)