Breaking News

‘బోన్‌ మీల్‌’ ఉపయోగాలేంటి?

Published on Fri, 06/19/2026 - 09:54

సేంద్రియ మిద్దెతోటలు, ఇంటిపంటల సాగులో బోన్‌ మీల్‌ వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • మిద్దెతోటల్లో పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకి బోన్‌ మీల్‌ పొడిని వేయడానికి కొన్ని ప్రత్యేక సమయాలు, పద్ధతులు ఉన్నాయి.

  • ఇది మొక్కలకు కావలసిన ఫాస్పరస్, కాల్షియంను నెమ్మదిగా అందిస్తుంది.

  • కొత్తగా మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు వేసేటప్పుడు కుండీలోని మట్టి మిశ్రమంలో బోన్‌ మీల్‌ కలపడం చాలా మంచిది. దీని వల్ల వేర్లు బలంగా అభివృద్ధి చెందుతాయి.

  • మొక్కలు పూతకు వచ్చే ముందు లేదా మొగ్గలు తొడిగే దశలో బోన్‌ మీల్‌ వేయడం వల్ల పూత రాలకుండా ఉంటుంది. కాయ సైజు పెరుగుతుంది. ముఖ్యంగా టమోటాలు, మిర్చి వంటి కూరగాయలకి ఇది బాగా ఉపయోగపడుతుంది.

  • బీట్‌రూట్, క్యారెట్, బంగాళాదుంప వంటి నేల లోపల పెరిగే దుంప జాతి మొక్కలకు ఇవి ఊరే సమయంలో వేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుంది.

  • వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు వేగంగా పెరిగే సమయంలో ఒకసారి వేయవచ్చు.

  • బోన్‌ మీల్‌ చాలా నెమ్మదిగా కరిగే ఎరువు. కాబట్టి దీన్ని ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుంది.

  • కుండీలోని పై మట్టిని కొద్దిగా తవ్వి, మొక్క మొదలుకు కొంచెం దూరంగా వేసి తిరిగి మట్టితో కప్పేయాలి.

బోన్‌ మీల్‌ వేసిన తర్వాత వెంటనే తగినంత నీరు పోయాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

#

Tags : 1

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు