Breaking News

కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!

Published on Tue, 09/17/2024 - 12:20

శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ  పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్‌ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్‌ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో  పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్‌ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్‌ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము  కొలత, హిప్స్‌ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. 

సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ  0.85 కంటే తక్కువగా ఉండాలి.  పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్‌ఆర్‌ (వేయిస్ట్‌ బై హిప్‌ రేషియో) అంటారు. పైన పేర్కొన్న   ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86  కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95  కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త  ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్‌ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్‌ ఒబేసిటీ అని కూడా అంటారు.  (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)

ఇలా అబ్డామినల్‌ ఒబేసిటీ లేదా సెంట్రల్‌ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్‌ బై హిప్‌ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్‌ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో  పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.
 

ఇదీ చదవండి:  పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)