Breaking News

బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Published on Sat, 07/06/2024 - 16:42

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం.   ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు  చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్‌ అనేది  తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!

పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును  ప్రభావితం చేస్తాయి. 

ప్రొటీన్‌, ఫైబర్‌ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్‌ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.

రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.

సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్‌, ఫైబర్‌తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి.  ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్‌ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా   పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత  కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.

వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం.  మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం.  అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. 

వాకింగ్, జాకింగ్‌, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.

నోట్‌: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)