Breaking News

నత్త జిగురుతో కాంతులీనే చర్మం..!

Published on Sun, 08/17/2025 - 09:04

ఈ అత్యాధునిక చర్మ సంరక్షణ పరికరం అందాన్ని కోరుకునేవారికి ఒక వరం. చర్మానికి ఎల్‌ఈడీ థెరపీలను అందించే డివైస్‌లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా, సౌందర్యప్రియులకు ఈ మెషిన్‌ అందించే పర్ఫెక్షనే వేరు! దీనిలోని ఫొటో–బయోమాడ్యులేషన్‌  టెక్నాలజీ.. ఆన్‌  చెయ్యగానే ఎరుపు కాంతిని విడుదల చేస్తూ, కేవలం 12 నిమిషాల్లోనే ముఖానికి కొత్త మెరుపుని అందిస్తుంది. దీని పనితీరు క్లినికల్‌ పరీక్షల్లో కూడా నిగ్గుతేలింది.

ఈ డివైస్‌ ముఖాకృతిలోనే రూపొందడంతో దీని ముందు ముఖాన్ని ఉంచినప్పుడు అన్నివైపుల నుంచి లైట్‌ థెరపీ జరుగుతుంది. దాంతో చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ఈ డియోర్‌ స్కిన్‌  లైట్‌ థెరపీని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు అందుకున్న తర్వాత వయసుతో వచ్చే ముడతలు, మచ్చలు చాలా వరకూ తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారుతుంది.

ఈ మాస్క్‌ డివైస్‌ అన్ని రకాల చర్మాలకు అనువైనదే. సున్నితమైన స్కిన్‌  టైప్‌ ఉన్నవారికి కూడా పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డివైస్‌ ఒక టేబుల్‌ ల్యాంప్‌లా అనిపిస్తుంది. దీని స్టాండ్‌ ఎటువైపు అయినా వంగుతూ, వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఆన్‌  చేసి లైట్‌ థెరపీ పొందేటప్పుడు, పడుకుని లేదా కూర్చుని కూడా ఈ ట్రీట్‌మెంట్‌ పొందొచ్చు.

వినూత్నమైన బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌లో ‘స్నెయిల్‌ క్రాల్‌ ట్రీట్‌మెంట్‌’ లేదా ‘స్నెయిల్‌ ఫేషియల్‌’ ఒక రకం! ఈ చికిత్సలో నత్తల నుంచి స్రవించే జిగురుతో చర్మంపై మసాజ్‌ చేస్తారు. ఈ విధానం ఎన్నో ఏళ్ల క్రితమే గ్రీస్‌లో ప్రారంభమైంది. తూర్పు ఆసియాలో, ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ నత్త జిగురుతో చర్మం తేమను పెంచడం, గాయాలను నయం చేయడం, కణాల పునరుద్ధరణ చేయడంతో పాటు కొన్ని రకాల చర్మ క్యాన్సర్‌లను కూడా నివారించవచ్చని నిపుణులు తేల్చారు. 

ఈ ట్రీట్‌మెంట్‌తో కొలాజెన్‌ ఉత్పత్తి పెరిగి, ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. అలాగే గాయాలు, అలర్జీలు, దురదలు వంటి సమస్యలు కూడా నయమవుతాయి. ఈ చికిత్సలో నేరుగా నత్తను చర్మంపై వదులుతారు. లేదంటే నత్త నుంచి సేకరించిన జిగురు ముఖానికి పూస్తారు. నత్త జిగురుతో ఇప్పుడు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి.  

(చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హెపటైటిస్‌ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?)

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు