Breaking News

తెల్లజుట్టుకు సహజమైన డై

Published on Tue, 01/06/2026 - 17:42

తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, కాపర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీ జుట్టు తెల్లరంగులోకి మారినట్లయితే.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే జుట్టుకు సహజ రంగును తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే... 

ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల నల్ల నువ్వులు,  ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల టీపొడి, మూడు టేబుల్‌ స్పూన్ల ఉసిరిపొడి, రెండు టేబుల్‌ స్పూన్లు ఆవనూనె తీసుకోవాలి.  

తయారీ విధానం: ముందుగా ఒక ఇనుప కడాయిలో నల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టీపొడి, ఉసిరి పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూడింటిని మీడియం మంట మీద వేయించాలి. మిశ్రమం పూర్తిగా నల్లగా మారినప్పుడు గ్యాస్‌ ఆఫ్‌ చేయాలి. చల్లబడిన తర్వాత మిక్సర్‌లో వేసుకుని బాగా గ్రైండ్‌ చేసి, జల్లించుకుని  గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. 

రెండు చెంచాల పొడిని తీసుకుని.. ఆవాల నూనెలో కలిపి పేస్టులా తయారు చేసి, జుట్టుకంతటికీ బాగా పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఎప్పటిలాగే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. నువ్వులు, టీపొడి, ఉసిరి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సాయపడతాయి. దీనితో ఎటువంటి దుష్ఫలితాలూ ఉండవు

నునుపైన మెడకోసం...
ఒక బంగాళదుంపని  పొట్టు తీయకుండా ఉడకబెట్టి,మెత్తగా మెదుపుకోవాలి. దీనికి కాసిని పాలు, కొద్దిగాకొబ్బరినూనె జతచేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈమిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరువాతకడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడనలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. 

(చదవండి: వెనెజువెలాలో 'ఏంజెల్‌' జలపాతం..! చేరుకోవడం అంత ఈజీ కాదు..)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)