Breaking News

కమల్‌ హాసన్‌ సౌందర్య చిట్కా..! ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి..

Published on Mon, 04/13/2026 - 15:58

నటి శృతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గాయనిగా, నటిగా నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. శృతి ఎప్పటికప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన టిప్స్‌ షేర్‌ చేస్తూ..ఆరోగ్యంపై స్ప్రుహను కలిగిస్తుంటారామె. అలానే ఈసారి తన జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో షేర్‌ చేస్తూ..ఆ విషయంలో తన తండ్రి ఇచ్చిన సౌందర్య చిట్కా గురించి మాట్లాడింది. ఆ చిట్కా చాలా బాగా పనిచేస్తుందని, దాన్ని గట్టిగా నమ్ముతానంటూ ఆ బ్యూటి టిప్‌ గురించి వివరించింది. ఇంతకీ ఏంటా సౌందర్య చిట్కా అంటే..

కూలీ నటి శృతి తాను ఆయిల్‌ని ఎంతో ఇష్టపడతానని, దీన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుంటానని అన్నారామె. ఇదేమి రెసిపీ లాంటిది కాకపోయినా..ఎంతో ఇష్టమని అంటోంది. నువ్వులు, కొబ్బరి నూనెతో కలగలసిన నూనె అంటే మహా ఇష్టమని, ఇది చర్మానికి, జుట్టుకి బాగా పనిచేస్తుందని తన నాన్నే(కమల హాసన్‌) స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చింది. 

నిపుణులు ఏమంటున్నారంటే..
జుట్టు ఆరోగ్యానికి నువ్వులు వల్ల  కలిగే అనేక ప్రయోజనాల కారణంగా సాంప్రదాయంగానూ, ఆధునికంగా కేశ సంరక్షణకు ది బెస్ట్‌ అని అన్నారు. దీనిలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ ఈ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని తెలిపారు. తలకు తీవ్రంగా తేమను అందించి జుట్టు కుదుళ్లను బలపరిచి, పెరుగుదలను ప్రేరేపిస్తుందని అన్నారు. దీనిలో సహజంగా ఉండే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు చుండ్రుని, వివిధ చర్మ సమస్యలను అరికట్టి..జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. 

అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని డల్‌గా కానివ్వకుండా నిరోధిస్తాయని అన్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్‌లు తలకు రక్తప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యానికి, విశ్రాంతికి సహాయపడతాయని చెప్పారు. అంతేగాదు ఆయుర్వేదం ప్రకారం..అన్ని నూనెల్లోకెల్లా నువ్వులు నూనె అత్యంత శ్రేష్టమైనదని అన్నారు. 

ఈ నువ్వుల నూనెని సౌందర్యం,  ఔషధ ఉత్పత్తులలో వినియోగిస్తారని చెబుతున్నారు. సాంప్రదాయకంగా, నువ్వుల నూనె నాడీ వ్యవస్థపై వెచ్చదనాన్ని, ప్రశాంతతను కలిగించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేరుగాంచింది. అంతేగాదు ఆయుర్వేదం నువ్వుల నూనెను నూనెలకే రాజుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాధికారకాలను నిర్మూలించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శక్తిని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు.

గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సం‍ప్రదించడం ఉత్తమం. 

(చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..)

 

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)