Breaking News

కాంతివంతమైన ముఖం కోసం..తియ్యటి తేనె!

Published on Wed, 01/28/2026 - 17:41

తియ్యటి తేనె ఆరోగ్య సంరక్షణలోనే కాదు..అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలకంగా ఉంటుంది. ఈ తేనెతో చేసిన మాయిశ్చరైజర్లు, ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని ప్రశాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మరి అలాంటి తేనెను సౌందర్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలంటే..

అర టీ స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్‌ వాటర్‌తో ఫోర్స్‌ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతుంది. 

మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, టీ స్పూన్‌ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్‌ ప్యాక్‌ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మంపై ఉన్న ట్యాన్‌ తొలగి΄ోయి ముఖం కాంతిమంతమవుతుంది.

తేనెలో ఉండే యాంటీ–సెప్టిక్‌ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక చెంచా తేనెలో అరచెంచా దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలున్న చోట రాసి, 10 నిమిషాల తరువాత కడిగేయాలి.

పెదవులు నల్లగా మారినా, పగిలినా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా తేనె, చక్కెర కలిపి పెదవులపై నెమ్మదిగా స్క్రబ్‌ చేయాలి. ఇది మృతకణాలను తొలగించి పెదవులను గులాబీ రంగులోకి మారుస్తుంది.

చెంచా తేనెతో పాలు లేదా పెరుగు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడగాలి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి ముఖచర్మాన్ని మృదువుగా మారుస్తుంది. 

(చదవండి: ఎసిడిటీని తగ్గించే యాలక్కాయ..! ఇలా తీసుకుంటే ఎంతో మేలు)
 

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)