Breaking News

పిగ్మెంటేషన్‌ పీడిస్తోందా?

Published on Wed, 10/22/2025 - 09:57

వయసు పెరిగే కొద్ది శారీరక మార్పులు కారణంగా పిగ్మెంటేషన్‌ వేధిస్తుంటుంది. ముఖం మంతా నల్లటి మచ్చలతో ముఖం కళ తప్పినట్లుగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో లభించే వాటితోనే సులభంగా చెక్‌పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా..!.

ఒక బంగాళ దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. ఈ మాస్క్‌ ని పిగ్మెంటేషన్‌ బాగా ఉన్న ప్రదేశాలలో అప్లై చేసి అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయండి. ఇలా నెల రోజుల పాటు రోజుకి రెండుసార్లు చేయవచ్చు.

నిమ్మరసం, తేనె..
రెండు టేబుల్‌ స్పూన్ల తేనెలో రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి. అవసరమున్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్‌ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి మీకు ఫలితం కనిపించే వరకూ చేయవచ్చు. 

టేబుల్‌స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకొని ఈ మూడింటినీ మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.

టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు తీసుకొని అందులో రెండు టేబుల్‌స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్‌లాగా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుందట.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు