Breaking News

హీట్‌ని బీట్‌ చేసేలా హెల్దీగా ఉందాం ఇలా..!

Published on Fri, 04/18/2025 - 08:22

భాగ్యనగరవాసులారా.. మీకో ‘సన్‌’గతి చెప్పాలా.. భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. న‘గరం’గరంగా మారుతోంది.. జర జాగ్రత్త! టెంపరేచర్‌ గ్రేడ్‌ పెరిగి 47 సెంటీగ్రేడ్‌ను టచ్‌ చేసే ప్రమాదం పొంచి ఉంది. నగర జీవనశైలిలో వేడికి అనుగుణంగా మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ ఏడాది వేసవి గత ఏడాదితో పోల్చితే ఎంత భిన్నంగా ఉందో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. వాతావరణ పరిశోధన నిపుణుల సూచనలను బట్టి చూస్తే ఈ వేసవి మరింతగా ఎండలు ఉండే అవకాశముంది. 2017లో నమోదైన 47 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలకు సమీపంగా ఈ ఏడాది వేసవి తాపం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. 

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం హైదరాబాద్‌లో ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా అదనంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశం ఉంది. ఇది నగరవాసులకు మరింత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. 

ఈ వేసవిలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వడదెబ్బ ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మే నెల వరకు వడదెబ్బ ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు నగరవాసుల నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. 

వేసవి తాపానికి ముఖ్యమైన జాగ్రత్తలు.. 
వేడి తీవ్రత పెరిగే సమయంలో మన శరీరం నుంచి ఎక్కువగా చెమట రూపంలో నీరు పోయి డీహైడ్రేషన్‌ సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల నీటిని రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు తాగడం, కొబ్బరి నీరు, నిమ్మకాయ రసం, బటర్‌ మిల్క్‌ లాంటి సహజ పానీయాలను 
ఎక్కువగా తీసుకోవడం అవసరం. 

ఇళ్ల నుంచి బయటకి వెళ్లే సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదు. వెళ్లాల్సి వచ్చినప్పుడు శరీరాన్ని కప్పి ఉంచేవిధంగా లైట్‌ కలర్‌ సూటీ దుస్తులు, కూలింగ్‌ గాగుల్స్, స్కార్ఫ్‌ లాంటి రక్షణ దుస్తులు ధరించాలి. సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా వాడాలి. 

ఆహారం విషయంలో వేడికాలం అంటే జీర్ణశక్తి తక్కువగా ఉండే సమయం. తేలికపాటి ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు, తేమ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంటిని చల్లగా ఉంచడానికి మొక్కలు, గాలి చక్కగా వచ్చేటట్లుగా విండోస్‌ ఏర్పాటు చేయడం మంచిది. 

కొన్ని తాత్కాలిక వర్షాలు నమోదు కావచ్చన్న అంచనాలున్నా, అవి వేసవి తీవ్రతను తగ్గించేంతగా ప్రభావం చూపించవు. అంతేకాదు.. వర్షాల తర్వాత తేమ పెరగడం వల్ల ఉక్కిరిబిక్కిరి చేయగల వాతావరణం ఏర్పడే ప్రమాదమూ ఉంది. ఈ సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండటం అవసరం.  

(చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్‌ లాస్‌ స్టోరీ)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)